IND vs ZIM 1st ODI: నేడే భారత్, జింబాబ్వే తొలి వన్డే.. లైవ్‌ స్ట్రీమింగ్, టైమింగ్ డీటెయిల్స్ ఇవే!

India vs Zimbabwe 1st ODI Live streaming Details. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, జింబాబ్వే జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 18, 2022, 03:26 PM IST
  • నేడే భారత్, జింబాబ్వే తొలి వన్డే
  • లైవ్‌ స్ట్రీమింగ్, టైమింగ్ డీటెయిల్స్ ఇవే
  • అందరి దృష్టి కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పైనే
IND vs ZIM 1st ODI: నేడే భారత్, జింబాబ్వే తొలి వన్డే.. లైవ్‌ స్ట్రీమింగ్, టైమింగ్ డీటెయిల్స్ ఇవే!

India vs Zimbabwe 1st ODI Live streaming Details: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, జింబాబ్వే జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. వరుస సిరీస్‌లు గెలుస్తున్న టీమిండియా మరో ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఈ సిరీస్‌ను భారత్ అలవోకగా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. జింబాబ్వే సిరీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం లేకున్నా.. కెప్టెన్‌  కేఎల్‌ రాహుల్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. రాహుల్ ఫామ్, ఫిట్‌నెస్‌, కెప్టెన్సీకి ఇది ఓ సవాల్ అని చెప్పొచ్చు. 

భారత్, జింబాబ్వే జట్ల మధ్య తొలి వన్డే హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12:45 ఆరంభం కానుంది. టాస్ అర్ధగంట ముందుగా మధ్యాహ్నం 12.15కు పడనుంది. ఈ భారతదేశంలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్‌ స్ట్రీమింగ్ కానుంది. అలానే సోనీలివ్ వెబ్‌సైట్ మరియు యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హరారే వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇటీవల బంగ్లాతో జరిగిన మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. మ్యాచ్ ఆరంభంలో పేసర్లకు వికెట్ అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచుకు ఎలాంటి వర్ష సూచన లేదు.

జట్లు (అంచనా):
భారత్‌: శిఖర్ ధావన్, శుబ్‌మాన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), సంజూ శాంసన్‌, దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్/దీపక్‌ చహర్‌, కుల్దీప్‌ యాదవ్, మొహ్మద్ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ/అవేశ్‌ ఖాన్‌.
జింబాబ్వే: తకుండ్జ్‌వనషే కైటానో, మరుమణి, కైయా, వెస్లీ, సికందర్‌ రజా, చకాబ్వా (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), ర్యాన్‌ బర్ల్‌, లూక్‌ జాంగ్‌వి, బ్రాడ్‌ ఇవాన్స్‌, విక్టర్‌ ఎన్‌యౌచి, తనాక చివాంగ.

Also Read: Sardar Sarvayi Papanna: సర్దార్ సర్వాయి పాపన్న జయంతి.. ఎవరీ పాపన్న ? ఎలా రాజయ్యాడు

Also Read: Rajinikanth as Governor: గవర్నర్ గా రజనీకాంత్.. ఇక సినిమాలకు బైబై!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News