దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడటంపై ఆమె తల్లి ఆశా దేవి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిర్బయ దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు శిక్ష అమలుకానుండగా.. కొన్ని గంటల ముందు కోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. తదుపరి తీర్పు వచ్చేవరకు ఉరిశిక్ష అమలు చేయరాదని ఆదేశించింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష పదే పదే వాయిదా పడటాన్ని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీర్ణించుకోలేకపోతున్నాడు. గతంలో కొన్ని మృగాలు నిర్భయపై హత్యాచారం చేశాయని, కానీ ఇప్పుడు మన వ్యవస్థ మరోసారి నిర్భయపై సామూహిక హత్యాచారం చేసిందంటూ అసహనం వ్యక్తం చేశాడు వర్మ. ఈ మేరకు వరుస ట్వీట్లు పేల్చాడు.
Nirbhaya was gang raped by animals and now she’s being gang raped by our system.
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2020
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు పదే పదే వాయిదా పడటంతో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని మరో ట్వీట్ చేశాడు. మిస్టర్ మోదీ.. నిర్భయ తల్లిదండ్రుల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించారా అని ప్రధానిని ప్రశ్నించాడు. ఏ చట్టాలు, నియమాలను పాటించచుండా ఓ యువతి జీవితాన్ని బలిగొన్న దోషులకు చట్ట పరమైన అంశాలపేరుతో కోర్టులు తీర్పును వాయిదా వేస్తున్నాయని మీకు తెలుసా అని ప్రధాని మోదీని ఉద్దేశించి ట్వీట్‌లో ప్రశ్నిస్తూ తన ఆవేదనను షేర్ చేసుకున్నాడు దర్శకుడు వర్మ.
Hey Mr. @narendramodi Can u even imagine what nirbhaya’s parents feelings would be ??? to know that all our courts are falling over each other to give all due processes to those rapists who dint follow a single fucking process in killing that poor girl .
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2020
కాగా, ఇలాంటి విషయాల్లోనైనా కరెక్ట్‌గా అడిగావని కొందరు కామెంట్లు చేస్తున్నారు. తాగి ట్వీట్లు చేస్తున్నావా వర్మ అని కొందరు ఈ విషయంలోనూ వర్మను ఏకిపారేస్తున్నారు. అయితే నరేంద్ర మోదీ బాధ్యుడు ఎందుకవుతారని, చీఫ్ జస్టిస్ సమాధానం చెప్పాలని అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌దే బాధ్యత అంటూ మరికొందరు రీట్వీట్లు చేస్తున్నారు. మొత్తానికి వర్మ మంచి విషయంపై ప్రశ్నించి మరో వివాదానికి ఆజ్యం పోసినట్లయింది.