Syllabus Cut: 50 శాతం తగ్గించే దిశగా సీబీఎస్ఈ, సీఐసీసీఈ బోర్డులు

కరోనా వైరస్ సంక్రమణ ప్రభావం విద్యపై తీవ్రంగా పడింది. దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపధ్యంలో ఇప్పటికే 30 శాతం సిలబస్ తగ్గించిన సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలు ఇప్పుడు మరో 20 శాతం తగ్గించేందుకు యోచిస్తున్నాయి.

Last Updated : Oct 10, 2020, 09:24 PM IST
Syllabus Cut: 50 శాతం తగ్గించే దిశగా సీబీఎస్ఈ, సీఐసీసీఈ బోర్డులు

కరోనా వైరస్ ( Corona virus )  సంక్రమణ ప్రభావం విద్యపై తీవ్రంగా పడింది. దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపధ్యంలో ఇప్పటికే 30 శాతం సిలబస్ తగ్గించిన సీబీఎస్ఈ ( CBSE ), ఐసీఎస్ఈ ( ICSE ) లు ఇప్పుడు మరో 20 శాతం తగ్గించేందుకు యోచిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా అమలవుతున్న ఐసీఎస్ఈ, సీబీఎస్ఈలలో విద్యా ప్రమాణాలు అధికంగా ఉంటాయి. కరోనా వైరస్ నేపధ్యంలో దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల కారణంగా 2020-21 అకాడమిక్ ఇయర్లో ఈ రెండు బోర్డులు సిలబస్ 30 శాతం తగ్గించేశాయి. రెగ్యులర్ సిలబస్ తో విద్యార్దులకు బోధన చేయలేమని భావించిన ఐసీఎస్ఈ బోర్డు 9 నుంచి 12 తరగతుల సిలబస్ ను 30 శాతం తగ్గించేసింది. అనంతరం సీబీఎస్ఈ కూడా అదే బాటలో పయనించి 30 శాతం సిలబస్ తగ్గించింది. అనంతరం వివిధ రాష్ట్ర బోర్డులు కూడా అదే పని చేశాయి.

కరోనా సంక్రమణ నేపధ్యంలో ఇప్పటికీ స్కూళ్లు తెరుచుకోకపోవడం, ఆన్‌లైన్‌ తరగతులు ( Online Classes ) కొనసాగుతుండటం వల్ల  జాతీయ విద్యా బోర్డులు పరీక్షలను 45 నుంచి 60 రోజులు ఆలస్యం చేయాలని ఆలోచిస్తున్నాయి. బోర్డు పరీక్షల ( Board Examinations )ను సైతం ఏప్రిల్‌కు మార్చే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా  నిర్ణయం తీసుకోలేదు. కాగా పాఠశాలలు, కళాశాలలను తిరిగి తెరవడానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నాన్-కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 15 నుంచి దశలవారీగా పాఠశాలలను తిరిగి తెరవవచ్చని ఉంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టింది. కానీ ఇప్పటికీ భారత్‌లో కోవిడ్‌ విజృంభణ కొనసాగుతున్నందున చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపంచేందుకు సిద్ధంగా లేరు. దీంతో ఇప్పట్లో స్కూళ్లకు పూర్తి స్థాయి హాజరు ఉండకపోవచ్చు.

ఈ నేపధ్యంలో ఈ ఏడాది బోర్డు పరీక్షలను మరింత సులభతరం చేసేందుకు సిలబస్ ( Syllabus ) ‌ను ఇంకా తగ్గించేందుకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్ఈ ఆలోచిస్తున్నాయి. ఇంతకు ముందు ప్రకటించినట్టు 30 శాతం కాకుండా..50 శాతం తగ్గించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రానందున ఈ ఏడాది బోర్డు పరీక్షలు 70 శాతం లేదా 50 శాతం సిలబస్‌తో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై రెండు బోర్డులు త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. Also read: NEET Results 2020: నీట్ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు విడుదల తేదీలు ఇవే! ఇలా చెక్ చేయండి

Trending News