సీబీఎస్ఈ నీట్ 2018 ఫలితాలు విడుదల

వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ నిర్వహించిన నేషనల్‌ ఎలిజబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) – 2018 ఫలితాలను సీబీఎస్ఈ  విడుదల చేసింది.

Last Updated : Jun 4, 2018, 01:19 PM IST
సీబీఎస్ఈ నీట్ 2018 ఫలితాలు విడుదల

వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ నిర్వహించిన నేషనల్‌ ఎలిజబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) – 2018 ఫలితాలను కొద్దిసేపటి క్రితం సీబీఎస్ఈ విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం గత నెల మే 6వ తేదీన నీట్‌ పరీక్షను నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 5న ఫలితాలను విడుదల చేయాల్సి ఉండగా.. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఒకరోజు ముందే ఫలితాలను వెల్లడించింది. ఫలితాలను cbseneet.nic.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. mohfw.nic.in, mcc.nic.inలలో కూడా విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు.

నీట్ 2018 ఫలితాల కోసం:

దశ 1: సీబీఎస్ఈ బోర్డ్ అధికారిక వెబ్సైట్‌ను సందర్శించండి - cbseneet.nic.in లేదా ఇక్కడ LINK 1 లేదా LINK 2 లపై క్లిక్ చెయ్యండి.

దశ 2:  CBSE NEET Result 2018 అనే లింక్‌పై క్లిక్ చేయండి.

దశ 3: మీ రోల్ నెంబర్ మరియు ఇతర సంబంధిత వివరాలను నమోదు చేయండి.

దశ 4: submit బటన్‌పై క్లిక్ చేయండి.

దశ 5: అభ్యర్థులు సీబీఎస్ఈ నీట్ 2018 ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Trending News