Parliament Session: వారం రోజుల ముందే ముగుస్తాయా?

కరోనా వైరస్ ప్రభావం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై పడుతోంది. దాదాపు 30 మంది వరకూ ఎంపీలు, కేంద్ర మంత్రులకు కరోనా వైరస్ సోకడంతో..సమావేశాల్ని వారం రోజుల ముందే ముగించడానికి కేంద్రం యోచిస్తోంది.

Last Updated : Sep 19, 2020, 03:30 PM IST
Parliament Session: వారం రోజుల ముందే ముగుస్తాయా?

కరోనా వైరస్ ( Coronavirus ) ప్రభావం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై పడుతోంది. దాదాపు 30 మంది వరకూ ఎంపీలు, కేంద్ర మంత్రులకు కరోనా వైరస్ సోకడంతో..సమావేశాల్ని వారం రోజుల ముందే ముగించడానికి కేంద్రం యోచిస్తోంది.

అక్టోబర్ 1 వరకూ కొనసాగాల్సిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ( Parliament monsoon sessions ) వారం రోజుల ముందే ముగియనున్నాయా అంటే అవుననే తెలుస్తోంది. కరోనా సంక్రమణ దృష్ట్యా సభ నడపడమనేది సవాలుగా మారిపోయింది. ఇప్పటికే దాదాపు 30 మంది వరకూ ఎంపీలు, కేంద్ర మంత్రులు కోవిడ్ బారిన పడ్డారు. ఇదంతా సమావేశాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే..కేసులు పెరుగుతుండటంతో సభా సమావేశాల నిర్వహణపై కేంద్రం పునరాలోచనలో పడినట్టు సమాచారం. అందుకే సమావేశాల్ని వారం రోజుల ముందే ( Rescheduling of parliament session ) ముగించడానికి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

సెప్టెంబర్ 14న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 18 రోజుల పాటు కొనసాగి..అక్టోబర్ 1 న ముగియాల్సి ఉంది. అయితే రోజురోజుకూ వైరస్ బారిన పడుతున్న సభ్యుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. దాంతో సమావేశాల్ని త్వరగా ముగిస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎంపీల నుంచి ఇదే అభిప్రాయం వెల్లడవుతోంది. ఈ క్రమంలో కీలకమైన బిల్లుల్ని ఆమోదించిన అనంతరం సమావేశాల్ని నిరవధికంగా వాయిదా వేసే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 24వ తేదీలోగా సమావేశాల్ని ముగించడానికి సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయబిల్లును ( Agriculture bill ) ఇప్పటికే లోక్ సభ ఆమోదం తెలిపింది. ఇప్పుడిక రాజ్యసభ ( Rajyasabha )లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంది. ఈ ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేసి పార్లమెంట్ సమావేశాల్ని వాయిదా వేయాలనేది ప్రధాన ఆలోచనగా ఉంది. Also read: AP: న్యాయవ్యవస్థ వర్సెస్ శాసన వ్యవస్థ..పార్లమెంట్ వేదికగా పోరాటం

Trending News