JEE Mains Exams: కరోనా ఉధృతి దృష్ట్యా వాయిదా పడ్డ జేఈఈ మెయిన్స్ పరీక్షలు

JEE Mains Exams: కరోనా మహమ్మారి వరుసగా రెండవ విద్యా సంవత్సరంపై ప్రభావం చూపుతోంది. కోవిడ్ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా జరిగే ప్రతిష్టాత్మక జేఈఈ మెయిన్స్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 4, 2021, 07:33 PM IST
JEE Mains Exams: కరోనా ఉధృతి దృష్ట్యా వాయిదా పడ్డ జేఈఈ మెయిన్స్ పరీక్షలు

JEE Mains Exams: కరోనా మహమ్మారి వరుసగా రెండవ విద్యా సంవత్సరంపై ప్రభావం చూపుతోంది. కోవిడ్ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా జరిగే ప్రతిష్టాత్మక జేఈఈ మెయిన్స్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.

దేశంలో కోవిడ్ సంక్రమణ (Covid Spread) శరవేగంగా విస్తరిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ( Corona Second Wave) ధాటికి దేశం అల్లకల్లోలమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరీక్షలు రద్దవుతున్నాయి. కొన్ని వాయిదా పడుతున్నాయి. 2020 విద్యా సంవత్సరంలో కూడా పరీక్షల్లేకుండానే గడిచిపోగా..ఈ విద్యా సంవత్సరం కూడా అదే విధంగా మారుతోంది. చాలా రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడగా..పదవ తరగతి పరీక్షలు రద్దు చేశారు. అదే విధంగా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై కూడా కరోనా సంక్రమణ ప్రభావం స్పష్టంగా పడుతోంది. కోవిడ్ విజృంభణ దృష్ట్యా ఇప్పటికే నీట్ పరీక్షలు (NEET Exams) వాయిదా పడ్డాయి. ఇప్పుడు జేఈఈ మెయిన్స్(JEE Mains Exams Postponed)పరీక్షల్ని కూడా వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు, అప్‌డేట్స్ కోసం సంబంధిత వెబ్‌సైట్ సందర్శించాల్సిందిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. కోవిడ్ విజృంభణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

Also read: West Bengal Violence: బెంగాల్ హింసపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీ

Trending News