West Bengal Violence: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింస చెలరేగింది. ఓ వైపు ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరగా..మరోవైపు ఇదే అంశంపై బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మే 2 వతేదీన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు(West Bengal Assembly Elections Results) వెలువడిన అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది.ఈ హింసాఘటనల్లో 12 మంది మరణించారనేది బీజేపీ (BJP) ఆరోపణగా ఉంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Pm Narendra Modi)..రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు ఫోన్ చేసి వివరాలు అడిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆరా తీశారు. రాష్ట్రంలో హింస, విధ్వంసం, దోపిడీలు , హత్యలు కొనసాగుతున్నాయని ప్రధాని మోదీకు చెప్పానన్నారు గవర్నర్ జగ్దీప్ ధన్కర్. శాంతిభద్రతల్ని పునరుద్ధరించేందుకు తక్షణం చర్యలు ప్రారంభించాలన్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda) హుటాహుటిన కోల్కతాకు చేరుకున్నారు. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని..దేశ విభజన సమయంలోనే ఇంతటి హింస జరిగిందని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ ఆరోపణల్ని అధికార టీఎంసీ ఖండించింది. బెంగాల్ శాంతి ప్రియమైన ప్రదేశమని తెలిపింది. బీజేపీనే తీవ్రమైన హింస ( West Bengal Violence) కు పాల్పడిందని..సీఏపీఎఫ్ ప్రయోగించిందని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రజలు మాత్రం రెచ్చిపోవద్దని, శాంతియుతంగానే ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఈ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని..సీబీఐ దర్యాప్తు చేయించాలని బీజేపీ సుప్రీంకోర్టు ( Supreme Court) లో పిటీషన్ దాఖలు చేసింది.
Also read: