Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ఇప్పుడు లక్ష్యానికి అతి సమీపంలో ఉంది. కేవలం 177 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీహరికోట నుంచి ప్రారంభమైన చంద్రయాన్ 3 నౌకను చంద్రునికి 177 కిలోమీటర్ల కక్ష్యలో ఉంచారు. అనుకున్న సమయానికి చంద్రునిపై ల్యాండ్ కానుందని తెలుస్తోంది.
చంద్రయాన్ 2 విఫలం చెందిన తరువాత ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే అంతరిక్షంలో పలు విజయాలు నమోదు చేసిన ఇస్రోవైపు ప్రపంచం ఎప్ప్పుడూ ఆసక్తిగా గమనిస్తుంటుంది. అందుకే ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం అంతటా చర్చనీయాంశమైంది. జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మొదలైన చంద్రయాన్ 3 ప్రయోగం ఇప్పటి వరకూ విజయవంతంగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్క దశనూ దాటుతోంది. ప్రస్తుతం చంద్రయాన్ 3ను 177 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో కేంద్రీకరించారు. ఆగస్టు 16 వతేదీన ఈ కక్ష్యను 100 కిలోమీటర్లకు తగ్గించనున్నారు. ఆ తరువాత ల్యాండర్ నుంచి విడిపోయి..చంద్రయాన్ 3 లాంచ్ కానుంది.
క్రమంగా వేగాన్ని, దూరాన్ని తగ్గిస్తూ ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండ్ చేసేందుకు అంతా సిద్ధమౌతోంది. ల్యాండర్ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్, రోవర్ నుంచి రోల్ అవుట్ కావడం అనేది ఇక మిగిలున్న ప్రధానమైన ప్రక్రియలు. ఇది కాస్తా విజయవంతమైతే ఆమెరికా, రష్యా, చెనా తరువాత ఈ ఖ్యాతిని ఆర్జించిన నాలుగవ దేశంగా ఇండియా ఉంటుంది.
మరోవైపు ఇదే నెలలో ఆగస్టు 11వ తేదీన చంద్రుడిపైకి రష్యా లూనా-25 రాకెట్ ప్రయోగించింది. లూనా-25తో చంద్రయాన్ 3 కు ఎలాంటి ఇబ్బంది కలగదని రష్యా అంతరిక్ష పరిశోథనా సంస్థ తెలిపింది. వాస్తవానికి ఈ ప్రయోగం 2021 లో ప్రయోగించాల్సి ఉంది. చాలా కారణాలతో ఆ ప్రయోగం వాయిదా పడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook