CM KCR Speech in Maharashtra: అన్నాభావ్ సాఠేకు భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. సాఠే 103వ జయంతి సందర్భంగా మంగళవారం మహారాష్ట్రలోని వాటేగావ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రముఖ మాతంగి దళిత కవి, దేశం గర్వించదగ్గ ప్రజా కవి, అన్నాభావ్ సాఠేకు దేశ పాలకులు సరైన గుర్తింపు ఇవ్వలేదన్నారు. అంటరాని కులంలో పుట్టి జీవితాన్ని వడబోసిన దళిత బిడ్డ, దేశ మూలవాసి మాతంగి సమాజ ముద్దుబిడ్డ, అన్నాభావ్ సాఠేను భారతరత్నగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సాఠే రచనలు, సాహిత్యం, అణగారిన వర్గాల కోసం వారి పోరాటం అజరామరం కేసీఆర్ అన్నారు. కమ్యూనిస్టుగా, అంబేద్కరిస్టుగా నిరంతరం సమసమాజ స్థాపన కోసం జీవితాంతం కృషి చేశారన్నారు. సాధారణ శాయరీలు చాలా మంది ఉంటారని, లోక్ శాహరీగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఘనత సాఠేకే దక్కిందన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం, లక్ష్యం కోసం ఏనాడు వెనుకడుగు వేయకుండా జీవితాంతం ప్రజలతో ఉన్నారని అన్నారు. రష్యాలాంటి దేశం సాఠేను గుర్తించి ఆ దేశ ప్రధాని పిలుపించుకుని సన్మానించారని సీఎం గుర్తుచేశారు.
"రష్యా లైబ్రరీలో సాఠే విగ్రహం ఉంది. సాఠే ఇండియన్ మాక్సిమ్ గోర్కేగా పేరొందింది. కానీ ఇంత గొప్పగా పేరొందిన సాఠేను భారత పాలకులు గుర్తించకపోవడం వారి సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమాలు తీసుకోకపోవడం శోచనీయం. సాఠే త్యాగాలను ఇప్పటికైనా మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలి. వారి రచనలన్నింటినీ భారత దేశంలోని అన్ని భాషాల్లో తర్జూమా చేయించాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాఠే విశ్వ జనీన తత్వాన్ని పరిచయం చేయాలని మహారాష్ట్ర సీఎం షిండేను, వారి మంత్రి వర్గాన్ని నేను ఒక్కటే కోరుతున్నా.. సాఠేను గౌరవించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే మన దేశాన్ని మనం గౌరవించడమే.." అని సీఎం కేసీఆర్ అన్నారు.
అన్నాభావ్ సాఠే జన్మించిన మాతంగి సమాజం దేశ మూల వాసులని ఆయన తెలిపారు. వీరు మాతంగి మహాముని వంశస్థులని చెప్పారు. ఈ సందర్భంగా పురాణ కాలం నాటి మాతంగి వంశ చరిత్రను, జన్మవృత్తాంతాన్ని వివరించారు. మాతంగి సమాజం గొప్పతనాన్ని మహాకవి కాళిదాసు కీర్తించారని తెలిపారు. సంగీత సాహిత్యానికి ఆది మూలమైన మాతంగి దేవతగా జ్నాన సరస్వతిగా కొలుస్తూ కాళిదాసు గొప్పగా వర్ణించారని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్నాభావ్ సాఠే ప్రతిమను, సాహిత్యాన్ని వారి కుటుంబ సభ్యులు బహుకరించారు.
Also Read: Gas Cylinder Price Today: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధర
Also Read: Amrit Bharat Stations: రాష్ట్రంలో అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపికైన స్టేషన్లు ఇవే.. ఈ నెల 6న ప్రధాని శంకుస్థాపన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి