కర్నాటకలో సంకీర్ణ ప్రభుతానికి లైన్ క్లియర్.. సీఎంగా కుమారస్వామి

        

Last Updated : May 20, 2018, 03:53 PM IST
కర్నాటకలో సంకీర్ణ ప్రభుతానికి లైన్ క్లియర్.. సీఎంగా కుమారస్వామి

ఎట్టకేలకు ఉత్కంఠతకు తెరపడింది. కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో క్లారిటీ వచ్చింది. బలనిరూపణకు ముందే బీజేపీ తేలిపోవడంతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ లేకపోవడంతో అధికారం విషయంలో బీజేపీ వెనక్కి తగ్గింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యకాదని భావించిన బీజేపీ నేత యడ్యూరప్ప సీఎంగా పదవికి రాజానామా చేశారు. దీంతో కాంగ్రెస్-జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

కాంగ్రెస్ జేడీఎస్ ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సీఎంగా బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే కుమారస్వామి మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోంది... అందులో కాంగ్రెస్ పార్టీకి  ఎన్ని మంత్రి పదవులు కేటాయించనున్నారు అనే విషయం తేలాల్సి ఉంది. 

మొత్తం 222 స్థానాలు ఉన్న కర్నాటక అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం 112.  కాంగ్రెస్ (78) జేడీఎస్ (38) ఇద్దరి బలం కలిపితే 116. ప్రభుత్వ ఏర్పాటుకు ఈ బలం సరిపోతుంది. బీజేపీ 104 స్థానాలు సాధించినప్పటికీ పూర్తి స్థాయి మెజార్టీ లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా తాజా పరిణామాలు కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.

Trending News