‘సీబీఐ’ వివాదంపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన, ఢిల్లీ ధర్నాలో పాల్గొన్న రాహుల్ అరెస్ట్

                     

Last Updated : Oct 26, 2018, 03:26 PM IST
‘సీబీఐ’ వివాదంపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన, ఢిల్లీ ధర్నాలో పాల్గొన్న రాహుల్ అరెస్ట్

‘సీబీఐ’ కుమ్ములాటలపై ఆందోళన చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సీబీఐ ఆఫీసుల ముందు ధర్నాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఢిల్లీ సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో స్వయంగా రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను దూకి సీబీఐ ఆఫీసుల్లోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు- కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు వాటర్ కేనన్లు, భాష్పవాయు గోళాల  ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Trending News