మోడీపై వివాదాస్పద ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్

     

Last Updated : Nov 27, 2017, 03:16 PM IST
మోడీపై వివాదాస్పద ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్

ప్రస్తుతం సోషల్ మీడియాలో చెప్పుల వార్ జరుగుతోంది.  ప్రధాని నరేంద్ర మోడీపై చెప్పు విసిరితే  బహుమతి ఇస్తానని ఒకరు ట్విట్టర్ లో ప్రకటించగా.. మోడీపై కాదు.. కేజ్రీవాల్ పై చెప్పు విసురుతానని  కౌంటర్ ఇచ్చారు మరోకరు.  ఇలా మొదలైంది ఈ వార్.  వివరాల్లోకి వెళ్లినట్లయితే...

సుబ్రమణియన్ ట్వీట్.

మోడీపై వివాదాస్పద ట్వీట్ చేసింది ప్రముఖ యాడ్ మేకర్ సుబ్రమణియన్. కాగా ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. మోడీపై కాదు.. కేజ్రీవాల్ మీద 1000 కే చెప్పువిసరుతామంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ట్వీట్ కు పద్మావతి కారణం !

పద్మావతి సినిమా వివాదంలో దీపికా పదుకునే తలను తెచ్చిన వారికి కోట్లలో బహుమతి అంటూ ఓ బీజేపీ నేత ప్రకటించడానికి వ్యతిరేకంగా సుబ్రమణియన్ ఈ ట్వీట్ చేసినట్లు తెలిసింది.  గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున  సుబ్రమణియన్ ప్రచారం చేశాడు. దీంతో ఆయన చేసిన ట్వీట్ వెనకాల కేజ్రీవాల్ హస్తమందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్వీట్ కు బదులిస్తూ కేజ్రీవాల్ మీద 1000 కే చెప్పువిసరుతామంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఓవర్ ఆల్ గా చూసినట్లయితే ఈ ట్వీట్ కు మిశ్రమ స్పందన వస్తోంది.

 

 

Trending News