Goa Danger Bells: గోవాలో కొనసాగుతున్న మరణ మృదంగం, ఆక్సిజన్ కొరతే కారణం

Goa Danger Bells: కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాపిస్తోంది. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు గాలిలో కల్సిపోతున్నాయి. గోవాలో నాలుగు రోజుల్నించి మరణ మృదంగం కొనసాగుతోంది. రోగులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 15, 2021, 07:00 AM IST
Goa Danger Bells: గోవాలో కొనసాగుతున్న మరణ మృదంగం, ఆక్సిజన్ కొరతే కారణం

Goa Danger Bells: కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాపిస్తోంది. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు గాలిలో కల్సిపోతున్నాయి. గోవాలో నాలుగు రోజుల్నించి మరణ మృదంగం కొనసాగుతోంది. రోగులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు.

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసేస్తోంది. కరోనా వైరస్ ధాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ కరోనా విపత్కర పరిస్థితులు అధికమవుతున్నాయి. ముఖ్యంగా బెడ్స్, ఆక్సిజన్, అత్యవసర మందుల కొరత తీవ్రమవుతోంది. నిన్నటి వరకూ ఆక్సిజన్ కొరత(Oxygen Shortage)తో డిల్లీలో మోగిన మరణ మృదంగం ఇప్పుడు గోవాకు విస్తరించింది.

గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పటల్ (Goa Medical College)లో గత నాలుగు రోజులుగా మరణ మృదంగం కొనసాగుతంది. ప్రతిరోజూ తెల్లవారుజామున మరణాల పరంపర కొనసాగుతోంది. కేవలం నాలుగు రోజుల్లో 75 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి రోజూ తెల్లవారుజూమున 2 గంటల్నించి 6 గంటల మధ్య కాలంలో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై బోంబే హైకోర్టు(Bombay High Court) లోని గోవా బెంచ్ విచారణ జరుపుతోంది. ఆక్సిజన్ సరఫరాలో లోపం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని గోవా అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. ఆక్సిజన్ తీసుకొచ్చే ట్యాంకర్ల లాజిస్టిక్ సమ్యసలతో ప్రమాదాలు ఎదురవుతున్నాయన్నారు. ఆక్సిజన్ ప్రెషర్ లోపం వల్ల కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు. కానీ వాస్తవానికి ఆసుపత్రుల్లోనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి.

Also read: Black Fungus: 52 మంది ప్రాణాలు తీసిన బ్లాక్ ఫంగస్, తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x