అసలే ''కరోనా వైరస్'' మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ పేరు వింటేనే జనం నిలువునా గజాగజా వణికిపోతున్నారు. భారత దేశంలోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు, సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలను ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రచారాల కోసం ప్రభుత్వాలు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పటికే రైళ్లు, విమానాలు, బస్సు ప్రయాణాలు రద్దు చేశారు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, స్కూళ్లు, కాలేజీలు అన్ని బంద్ చేశారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ కూడా పాటించనున్నారు. ఈ నేపథ్యంలో అంతటా బంద్ వాతావరణం కనిపిస్తోంది. కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు వీలైనంత వరకు వర్క ఫ్రమ్ హోమ్ పాటిస్తున్నారు.
Read Also: మందుబాబుల క్రమశిక్షణ
ఈ క్రమంలో రైల్వే శాఖ నిర్లక్ష్యం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైల్వే అధికారులు, సిబ్బందికి ప్రయాణీకుల భద్రత ఎంత ముఖ్యమో.. వారి నిర్లక్ష్యాన్ని చూస్తే అర్ధమవుతుంది. ప్రయాణీకులను, వారి ఆరోగ్యాన్ని రైల్వే అధికారులు గాలికి వదిలేసినట్లుగా తెలుస్తోంది. కేరళలోని ఓ రైల్వే అధికారి నిర్లక్ష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This is how an official of Indian Railways is scanning passengers for Corona with thermal scanner....@PiyushGoyal Sir, plz take note n do whatever you can to bring seriousness in the officials for corona scanning. pic.twitter.com/Q31X8Cr1Ab
— Adv. Somnath Bharti (@attorneybharti) March 21, 2020
Read Also: రజినీకాంత్ సాహస యాత్ర
కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న కారణంగా రైల్వే ప్రయాణికులను ప్రతి ఒక్కరినీ చెక్ చేసి పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ కేరళలోని ఓ అధికారి.. ఓ వైపు ఫోన్ లో మాట్లాడుకుంటూ.. కనీసం కూర్చున్న దగ్గరి నుంచి లేవలేదు. పైగా థర్మామీటర్ ను చాలా దూరంలో పెట్టి .. ఒక్కొక్క ప్రయాణీకున్ని చెక్ చేసినట్లుగా నటిస్తూ .. వెళ్లమని అనుమతిస్తున్నారు. ఈ వీడియోపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కేంద్ర రైల్వే శాఖ దీనిపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..