Cryptocurrency Bill: త్వరలో క్రిప్టోకరెన్సీపై బిల్లు, నియంత్రిస్తారా..అనుమతిస్తారా

Cryptocurrency Bill: క్రిప్టోకరెన్సీ. ఎక్కడ విన్నా ఇదే మాట. ఇండియాలో పరిస్థితి ఏంటి. నియంత్రించగలమా లేదా. అసలా అధికారముందా. ఈ ప్రశ్నలకు సమాధానంగా త్వరలో క్రిప్టోకరెన్సీ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.

Last Updated : Feb 9, 2021, 10:29 PM IST
Cryptocurrency Bill: త్వరలో క్రిప్టోకరెన్సీపై బిల్లు, నియంత్రిస్తారా..అనుమతిస్తారా

Cryptocurrency Bill: క్రిప్టోకరెన్సీ. ఎక్కడ విన్నా ఇదే మాట. ఇండియాలో పరిస్థితి ఏంటి. నియంత్రించగలమా లేదా. అసలా అధికారముందా. ఈ ప్రశ్నలకు సమాధానంగా త్వరలో క్రిప్టోకరెన్సీ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ ( Cryptocurrency ) హల్‌చల్ చేస్తోంది. భారీగా విలువ కూడా పెరుగుతుండటంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇండియాలో క్రిప్టోకరెన్సీ పరిస్థితి ఏంటనే ప్రశ్న వస్తోంది. ఇండియాలో క్రిప్టోకరెన్సీను నియంత్రించే అవకాశముందా లేదా. అసలు ఆ అధికారం మనకుందా. ఈ ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్‌లో క్రిప్టోకరెన్సీ బిల్లు ( Cryptocurrency bill )ప్రవేశపెట్టనుంది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాగూర్ ( Anurag Thakur ) సమాధానమిచ్చారు.

క్రిప్టోకరెన్సీకు సంబంధించిన లావాదేవీలను ప్రాసెస్ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( Reserve Bank of India ) 2018లో బ్యాంకుల్ని నిషేధించింది. మార్చ్‌లో సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నేపధ్యంలో బిట్ కాయిన్స్, క్రిప్టోకరెన్సీ వినియోగంపై ఆర్‌బి‌ఐ త్వరలో విధివిధానాలను ప్రకటించనుంది. కానీ ఇదొక సమస్యాత్మక అంశం. క్రిప్టోకరెన్సీను ఇండియాలో అరికట్టేందుకు కేంద్ర ఆర్ధికశాఖ ఏదైనా బిల్లు ప్రవేశపెట్టే అవకాశముందా అని కర్ణాటక బీజేపీ ఎంపీ కేసి రామమూర్తి అడిగారు. 

ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ఆర్‌బి‌ఐ, సెబి వంటి వంటి రెగ్యులేటరీ సంస్థలకు క్రిప్టోకరెన్సీలను నేరుగా నియంత్రించేందుకు ఎటువంటి చట్టపరమైన అధికారాలు లేవని చెప్పారు. ఎందుకంటే క్రిప్టోకరెన్సీ అనేది ఆస్థి, సెక్యూరిటీ, వస్తువు కాదని..ప్రస్తుత చట్టాలు ఈ అంశాన్ని పరిష్కరించేందుకు సరిపోవని మంత్రి తెలిపారు. అందుకే ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసిందని..కమిటీ నివేదిక ఆధారంగా నిపుణులతో చర్చించామని చెప్పారు. త్వరలో కేంద్ర కేబినెట్ ( Union Cabinet ) ముందు బిల్లు తీసుకొస్తామని వివరించారు. 

Also read: Aadhaar new app: పాత ఆధార్ యాప్ వాడవద్దు..కొత్తది వచ్చేసిందిప్పుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News