Cyclone Biparjoy Update: బిపార్జోయ్ తుఫాను ఇవాళ గుజరాత్ కచ్ జిల్లాలోని జఖౌ పోర్ట్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది జాఖౌ పోర్ట్ కి పశ్చిమ-నైరుతి దిశలో 180 కి.మీ. దూరంలో ఉంది. ఈ సమయంలో ఇళ్లుపైకప్పులు ఎగిరిపోవడం, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం జరగవచ్చు. ఇప్పటికే తీరానికి సమీపంలో నివశిస్తున్న 74వేల మందికి పైగా రాష్ట్ర ప్రజలను ఆ రాష్ట్ర ప్రభుత్వం తరలించింది. అంతేకాకుండా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో రెస్క్యూ మరియు రిలీఫ్ చర్యల కోసం విపత్తు నిర్వహణ యూనిట్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం గుజరాత్ తీరం వైపు దూసుకువస్తుండటంతో సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. తుపాన్ నేపథ్యంలో..సౌరాష్ట్ర మరియు కచ్, ద్వారక, పోర్ బందర్, జామ్‌నగర్, రాజ్‌కోట్, జునాఘర్ మరియు మోర్బీ జిల్లాల తీర ప్రాంతాల నుండి ప్రజలను గుజరాత్ ప్రభుత్వం తరలించింది. తుపాన్ ప్రభావంతో పంటలు దెబ్బతినడంతోపాటురైల్వేలు, ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లు, సిగ్నలింగ్ వ్యవస్థలకు అంతరాయం కలగవచ్చు.
మే 2021లో 'తౌక్టే' తర్వాత రెండేళ్లలో రాష్ట్రాన్ని తాకిన రెండో తుఫాను ఇదే. 'బిపార్జోయ్' తుపాను 150 కిలోమీటర్ల వేగంతో గురువారం సాయంత్రం జఖౌ పోర్ట్ సమీపంలో తీరాన్ని తాకనుంది. తుపాన్ నేపథ్యంలో సమీప రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ సైక్లోన్ ప్రభావంతో చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి