నిర్మాణంలో వున్న అపార్ట్‌మెంట్ కూలి నలుగురు మృతి

నిర్మాణంలో వున్న అపార్ట్‌మెంట్ కూలి నలుగురు మృతి

Updated: Jul 10, 2019, 11:20 AM IST
నిర్మాణంలో వున్న అపార్ట్‌మెంట్ కూలి నలుగురు మృతి
ANI photo

బెంగళూరు: నిర్మాణంలో వున్న భవనం కూలి నలుగురు మృతిచెందిన ఘటన బెంగళూరులోని పులికేశి నగర్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏడుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బెంగళూరు పోలీసులు, సివిల్ డిఫెన్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలం వద్ద సహాయచర్యల్లో పాల్గొంటున్నాయి. 

భవనం కూలిపోవడానికి వెనుకున్న కారణాలు, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.