జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా దీపికా పదుకొనే

జవహార్‌లాల్ నెహ్రూ యూనిర్సిటీలో నెల 4న విద్యార్థులపై జరిగిన కిరాతక దాడికి వ్యతిరేకంగా, విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే తన మద్దతు ప్రకటించారు. దాడిలో గాయపడిన విద్యార్థుల్ని పరామర్శించిన దీపికా పదుకొనే వారికి ఎదురైన అనుభవాల గురించి మాట్లాడారు.

Updated: Jan 8, 2020, 10:09 AM IST
జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా దీపికా పదుకొనే

హైదరాబాద్ : జవహార్‌లాల్ నెహ్రూ యూనిర్సిటీలో నెల 4న విద్యార్థులపై జరిగిన కిరాతక దాడికి వ్యతిరేకంగా, విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే తన మద్దతు ప్రకటించారు. దాడిలో గాయపడిన విద్యార్థుల్ని పరామర్శించిన దీపికా పదుకొనే వారికి ఎదురైన అనుభవాల గురించి మాట్లాడారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన నిరసనలో పాల్గొని వారికి అండగా నిలబడ్డారు.

జవనరి 4న సాయంత్రం సమయంలో ముసుగులో వచ్చిన కొంతమంది దుండగులు రాడ్లు, పదునైన ఆయుధాలతో విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడి చేశారు. దాదాపు రెండు గంటల పాటు క్యాంపస్‌లో భయానక వాతావరణం సృష్టించారు. ఈ దాడిలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ సహా మరో 25 మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు తీవ్రంగా గాయపడ్డారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..