World Cup 2023 Semi Finals Qualification Scenario: "చేతులు కాలాక.. ఆకులు పట్టుకోవడం.." అనే సామెత పాకిస్థాన్ టీమ్‌కు సరిగ్గా సరిపోతుంది. వరల్డ్ కప్‌లో అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేక వరుస ఓటములతో సెమీస్ రేసులో వెనుకపడిపోయింది. ఆ తరువాత తేరుకున్నా.. అప్పటికే ఇతరు జట్లు రేసులో దూసుకుపోయాయి. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టాప్-3 బెర్త్‌లను ఫిక్స్ చేసుకోగా.. ఉన్న ఒక్క ప్లేస్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు రేసులో నిలిచాయి. గురువారం శ్రీలంకపై భారీ విజయంతో కివీస్ జట్టు సెమీస్ రేసులో ముందడుగు వేసింది. అఫ్గానిస్థాన్ జట్టుకు ఏ మాత్రం అవకాశాలు లేకపోగా.. పాక్ జట్టు సెమీస్ చేరాలంటే మహా అద్భుతమే జరగాలి. సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ చూడాలనుకున్న అభిమానులకు నిరాశే అని చెప్పొచ్చు. నెట్‌రన్ రేట్‌తో న్యూజిలాండ్ సెమీస్‌లోకి 4వ జట్టుగా ఎంట్రీ ఇవ్వడం లాంఛనమే. టీమిండియాతో తొలి సెమీ ఫైనల్ ఆడనుంది.
ప్రస్తుతం 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు 10 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగోస్థానంలో ఉంది. పాకిస్థాన్ 8 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కివీస్ నెట్ రన్‌రేట్ 0.743 ఉండగా.. పాక్‌కు 0.036 ఉంది. ఈ రన్‌రేట్‌ను దాటలంటే పాక్ తమ చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించాల్సి ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేస్తే.. కనీసం 287 పరుగుల తేడాతో ఓడించాలి. రెండో బ్యాటింగ్ అయితే.. ఇంగ్లాండ్ 150 పరుగులు చేస్తే.. పాక్ ఆ లక్ష్యాన్ని 3.4 ఓవర్లలోనే ఛేదించాలి. ఇది అసాధ్యం. టాస్‌పైనే పాక్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసి వీరవీహారం చేసి.. తరువాత బౌలర్లు తక్కువ స్కోరుకే ఆలౌట్ చేస్తే పాకిస్థాన్‌కు ఛాన్స్ ఉంటుంది. అఫ్గానిస్థాన్ సెమీస్ చేరాలంటే తమ చివరి మ్యాచ్‌లో సఫారీపై 438 రన్ప్ తేడాతో గెలవాలి. సో అఫ్గానిస్థాన్ కూడా టోర్నీ నుంచి నిష్ర్కమించినట్లే.
సెమీ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడడం ఖాయమైంది. 2019 సెమీ ఫైనల్‌లో కూడా కివీస్‌తోనే భారత్ సెమీస్ ఆడింది. ఇప్పుడు అదే జట్టుతో సెమీస్ అంటే టీమిండియా అభిమానుల్లో కాస్త కలవరం మొదలైంది. వరుస విజయాలు సాధించి జోరు మీదు ఉన్నా.. సెమీ ఒత్తిడిని తట్టుకుని న్యూజిలాండ్‌ను ఓడిస్తారా..? లేదా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ దశలో కివీస్ బౌలింగ్ దాడికి ఛేజింగ్‌లో మనోళ్లు కాస్త తడబడ్డారు. లక్ష్యం కాస్త తక్కువగా ఉండడంతో విజయం సొంతమైంది. ఏది ఏమైనా న్యూజిలాండ్‌పై టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్ టీమిండియా.
Also Read: NZ Vs SL World Cup 2023: కివీస్ వచ్చేస్తోంది.. పాక్ ఆశలపై శ్రీలంక నీళ్లు.. సెమీస్ ఫైట్ ఇలా..!
Also Read: Reservation Bill: కులాల రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. ఆ రాష్ట్రంలో 75 శాతం రిజర్వేషన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook