Delhi: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల హల్ చల్.. 'ఇండిగో చోర్ హై'.. అంటూ నినాదాలు.. కారణం ఏంటంటే..?

Flyers Protest: డియోఘర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ఇండిగో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అప్పటి వరకు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ప్యాసింజర్స్ ఇండిగో ఆఫీస్ కు చేరుకున్నారు. మూకుమ్మడిగా అక్కడ నినాదాలు చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 31, 2024, 02:14 PM IST
  • - ఢిల్లీలోని ఎయిర్ పోర్టులో ప్యాసింజర్ల రచ్చ..
    - దియోఘర్ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేసిన ఇండిగో ఎయిర్ లైన్స్..
    - ఇండిగో చోర్ హై అంటూ నినాదాలు
Delhi: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల హల్ చల్.. 'ఇండిగో చోర్ హై'.. అంటూ నినాదాలు.. కారణం ఏంటంటే..?

IndiGo Flight To Deoghar: కొన్నిరోజులుగా ఢిల్లీలో దట్టంగా మంచు కురుస్తుంది. ఉదయం పూట మంచు దుప్పటి కప్పేసిన విధంగా మారడంతో విమాన ప్రయాణాకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ అధికారులు ఇలాంటి సమయాలలో విమానాలను తరచుగా రద్దు చేసుకొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే..  కొన్ని సందర్భాలలో  ప్రయాణికులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎయిర్ పోర్ట్ సిబ్బంది విమానలు రద్దు చేసినప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురౌతుంటారు. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది..

పూర్తి వివరాలు..

దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో తీవ్ర గందర గోళ పరిస్థితి ఏర్పడింది. జార్ఖండ్‌లోని డియోఘర్‌కు  విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించింది. దీంతో అప్పటి వరకే ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్యాసింజర్ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూకుమ్మడిగా ఇండిగో  కార్యలయానికి చేరుకుని, ఆకస్మికమైన ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.

అంతటితో ఆగకుండా ''ఇండిగో చోర్ హై..".. అంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీంతో ఎయిర్ పోర్ట్ సిబ్బంది ప్యాసింజర్ లను సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడున్న వారు ఏంచెప్పిన వినకుండా గట్టిగా అరుస్తూ, నిరసలను చేపట్టారు.  దీంతో ఎయిర్ పోర్టులో టెన్షన్ వాతావరణం నెలకొంది.  దేశ రాజధాని దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉండటం వల్ల ఈ రోజు ఢిల్లీ విమానాశ్రయం నుండి పలు సర్వీసులను ఎయిర్‌లైన్ రద్దు చేసినట్లు సమాచారం. 

Read Also: High Court: ''దేవాలయాలు పిక్నిక్ స్పాట్ లు కావు..".. హిందూయేతరుల ప్రవేశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన మద్రాసు హైకోర్టు...
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News