దీపావళి అనంతరం ఉత్తరాదిన జరుపుకునే మరో కీలకమైన వేడుక ఛాత్ పూజ. బహిరంగ ప్రాంతాల్లో ఈ వేడుకలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై విచారణ సందర్బంగా ఢిల్లీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
దీపావళి ( Diwali ) తరువాత అంటే నవంబర్ 20న ఉత్తరాది ప్రముఖ వేడుక ఛాత్ పూజ ( Chhatch puja ). బహిరంగ ప్రదేశాల్లో ఈ పూజల నిర్వహణను ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం ( Delhi Kejriwal government ) నిషేధించింది. కరోనా వైరస్ సంక్రణ విజృంభిస్తున్న నేపధ్యంలో ఇలాంటి కార్యక్రమాల వల్ల సూపర్ స్ప్రెడర్లు పుట్టుకొచ్చే ప్రమాదముందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. రాజధాని నగరంలో నివసించే బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఛత్ పూజ నవంబర్ 20న ప్రారంభం కానుంది. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైన కారణంగా సామూహిక సమావేశాలు, వేడుకల్ని అనుమతించేది లేదని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకటించింది.
ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దుర్గా జన్ సేవా ట్రస్టు హైకోర్టు ( Delhi High court )ను ఆశ్రయించింది. ఛత్ పూజ నేపథ్యంలో కనీసం వెయ్యి మందికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషనర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తూ విస్మయం వ్యక్తం చేసింది. జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. అవునా..నిజంగానా...ఢిల్లీ ప్రభుత్వం వివాహ శుభాకార్యాలకు కేవలం 50 మందికే అనుమతి ఇస్తానని పేర్కొంది. మీరేమో వెయ్యి మందికి అనుమతి కావాలంటున్నారు..ఇదెలా సాధ్యపడుతుంది అంటూ ప్రశ్నించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా వ్యవహరించడం సరి కాదని హితవు పలికింది. ఓవైపు కోవిడ్ ( Covid ) ఇన్ఫెక్షన్ రేటు పెరిగిపోతోందని.. కేసుల సంఖ్య 7 వేల 8 వందల నుంచి 8 వేల 593కు పెరిగిందని కోర్టు వెల్లడించింది. అటు మరణాల రేటు కూడా రెట్టింపైందని..బహుశా వీటి గురించి అవగాహన లేదా అని వ్యాఖ్యానించింది.
Also read: Covid19 Vaccine: భూమిపై అందరికీ వ్యాక్సిన్ ఉచితంగా అందించాలి