అతనికి 17 ఏళ్ళ జీతం చెల్లించాల్సిందే..!

  

Last Updated : Nov 12, 2017, 03:38 PM IST
అతనికి 17 ఏళ్ళ జీతం చెల్లించాల్సిందే..!

ఒక బస్ కండక్టరుని నిర్దాక్షిణ్యంగా విధుల నుండి తప్పించినందుకు ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషనుకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. డీటీసీ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వలన ఓ చిరుద్యోగి ఉద్యోగం పోయిందని.. ఇది జరిగి 17 సంవత్సరాలు అవుతుంది కాబట్టి.. ఇన్ని సంవత్సరాలుగా అతనికి రావాల్సిన జీతం, బెనిఫిట్స్ అన్నీ కూడా అందజేయాలని తెలియజేసింది.1981లో చందర్ సింగ్ అనే అతను డీటీసీలో కండక్టరుగా ఉద్యోగంలో చేరాడు.

1982లో ప్రొబేషన్ పూర్తయ్యాక పర్మినెంట్ ఉద్యోగిగా మారాడు. అయితే తప్పుడు విద్యార్హత పత్రాలు చూపించి చందర్ సింగ్ ఉద్యోగం సంపాదించాడని, మరో ఉద్యోగి అభియోగం మోపాక అతన్ని డీటీసీ ఉద్యోగం నుండి తొలిగించింది. ఉద్యోగం కోల్పోయాక చందర్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు వాదప్రతివాదనలు విన్నాక, చందర్‌ను అన్యాయంగా విధులు నుండి తొలిగించారని, అతనిపై మోపబడింది తప్పుడు అభియోగమని భావించి, తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని డీటీసీని ఆదేశించింది.

ఆ తీర్పును సవాలు చేస్తూ, డీటీసీ చందర్ సింగ్‌ను మోసగాడిగా పేర్కొంటూ మరో పిటీషన్ దాఖలు చేసింది. ఇది జరిగి దాదాపు 17 సంవత్సరాలు కావస్తోంది. ఇటీవలే ఎన్నాళ్లగానో పెండింగ్‌లో ఉన్న  ఈ కేసుకి సంబంధించి ప్రకటన చేస్తూ.. చందర్‌కి మళ్లీ అనుకూలంగానే తీర్పు ఇచ్చింది కోర్టు. "ఆ వ్యక్తి బతికున్నాడో లేదో తెలియదు.. అదే మాట డీటీసికి కూడా వర్తిస్తుంది. అప్పుడు ఇచ్చిన తీర్పునే మళ్లీ ఇవ్వడం జరుగుతోంది. అందులో ఎలాంటి మార్పు లేదు. డీటీసీ తన వైపు తప్పు ఉంచుకొని కాలయాపన చేస్తూ.. కేసును తప్పుదోవ పట్టించింది. వారి ప్రవర్తన వలన ఓ నిరుద్యోగి ఉద్యోగం పోయింది.. ఇప్పుడు డీటీసీ స్వయంగా ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో కనుక్కొని.. 17 సంవత్సరాలుగా తనకు రావాల్సిన జీతం, బెనిఫిట్స్ అన్నీ కూడా అందివ్వాలి" అని ఆదేశించింది

Trending News