Delhi Status: దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు ఊపిరి పీల్చుకోనుంది. నిన్నటివరకూ ప్రాణవాయువు లేక ఊపిరి నిలిచి తల్లడిల్లిన ఢిల్లీ ఇప్పుడు కోలుకుంటోంది. ఆక్సిజన్ డిమాండ్ తగ్గిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
దేశంలో కరోనా మహమ్మారి (Corona Pandemic) విజృంభణ ఇంకా కొనసాగుతోంది. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి శుభవార్త అందుతోంది. నిన్నటి వరకూ ఢిల్లీలో ఆక్సిజన్ అందక పరిస్థితి ఘోరంగా మారింది. 3-4 ఆసుపత్రుల్లో అయితే ఆక్సిజన్ సరఫరా లేక మరణ మృదంగం మోగింది. పదుల సంఖ్యలో కరోనా రోగుల ఊపిరి నిలిచిపోయింది. ఆక్సిజన్ లేక ఓ వైపు, ఆక్సిజన్ బెడ్స్ ఖాళీ లేక మరోవైపు దారుణ పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో దేశమంతా ఢిల్లీ వైపు ఆందోళనగా చూసింది. ఇప్పుడు అదే ఢిల్లీలో పరిస్థితి మెరుగు పడుతోంది.ఆక్సిజన్ డిమాండ్ తగ్గుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు.
కరోనా మహమ్మారి ఢిల్లీ (Delhi) లో కొద్దిగా తగ్గుముఖం పట్టిందని..ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ అవుతున్నాయని మనీశ్ సిసోడియా తెలిపారు. ఆక్సిజన్ డిమాండ్ ( Oxygen Demand) కూడా తగ్గిందని ఆయన చెప్పారు. అందుకే మిగులు ఆక్సిజన్‌ను అవసరమున్న ఇతర రాష్ట్రాలకు పంపవచ్చని..కరోనా వైరస్ కేసుల్లో తగ్గుదల వచ్చిందని కేంద్రానికి సూచించినట్టు తెలిపారు. కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు అంటే 15 రోజుల క్రితం వరకూ రోజుకు 7 వందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమయ్యేది. ఇప్పుడు ఆ 582 మెట్రిక్ టన్నులకు పడిపోయిందని మనీశ్ సిసోడియా స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలోనే రోజుకు 582 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో పని జరుగుతోందని.. ఢిల్లీ కోటా నుంచి మిగులు ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు ఇవ్వమని కేంద్రానికి చెప్పామన్నారు. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు ప్రజల సహాయం కోసం వచ్చిన కేంద్రానికి, ఢిల్లీ హైకోర్టుకు ఈ సందర్బంగా మనీశ్ సిసోడియా(Manish Sisodia) కృతజ్ఞతలు తెలిపారు. ఢల్లీలో తాజాగా 10 వేల 4 వందల కేసులు నమోదయ్యాయి.పాజిటివిటీ రేటు 14 శాతానికి పడిపోయింది. కరోనా సంక్రమణ ఛైన్‌ను తెంపేందుకు ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన లాక్‌డౌన్‌తో పరిస్థితి అదుపులో వస్తోంది.
Also read: Oxygen on Wheels: ఏపీలో వినూత్న పథకం, ఆక్సిజన్ ఆన్ వీల్స్ ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook