నిజంగా ఆశ్చర్యమే. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడైన ధారావి ఇప్పుడు జీరో కరోనా కేసులతో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నివారించడం అసంభవమనుకున్న పరిస్థితి నుంచి సాధ్యమేనని నిరూపించిన పరిస్థితి.
ఆసియా ( Asia ) లోనే అతి పెద్ద మురికివాడ ముంబై ( Mumbai ) లోని ధారావి ( Dharavi ) అని అందరికీ తెలిసిందే. పది లక్షల జనాభా ఉన్న ప్రాంతమిది. ఏప్రిల్ 1 న తొలి కరోనా కేసు నమోదయ్యాక..ఇక అరికట్టడం అసాధ్యమనుకున్నారంతా. ఎందుకంటే ఇరుకైన గల్లీల్లో..అంతకంటే ఇరుకైన ఇళ్లల్లో..కిక్కిరిసిన జనాభా ఉండే ప్రాంతమిది. అనుకున్నట్టుగానే వేగంగా కేసులు పెరిగిపోయాయి. దాంతో మహారాష్ట్ర ( Maharashtra ) అధికారులు ధారావిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పటిష్టమైన చర్యలతో ధారావిలో కరోనాను నియంత్రించగలిగారు. ఇప్పుడు ధారావి కరోనా సంక్రమణలో జీరోకేసుకు చేరుకుంది.
4టీ ఫార్ములా ( Four t formula ) తో అధికారులు పగడ్బందీగా వ్యవహరించారు. ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ ఫార్ములాతో కరోనా సంక్రమణను నియంత్రించారు. జూలై 26 తరువాత కేవలం రెండే రెండు కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత స్వల్పంగా పెరిగి..మళ్లీ తగ్గిపోయింది. తొలిసారిగా ఇప్పుడు ఒక్క కేసు కూడా నమోదు కాని పరిస్థితికి చేరింది. కట్టుదిట్టమైన ప్రణాళికతో కరోనా వైరస్ ( Corona virus )ను కట్టడి చేశారని డబ్ల్యూహెచ్‌వో ( WHO ) సైతం ప్రశంసించింది. మహారాష్ట్రలో కొత్తగా 3 వేల 580 మందికి పాజిటివ్ రాగా..మొత్తం కేసుల సంఖ్య 19 లక్షల 50 వేలకు చేరింది.
Also read: PM-KISAN scheme: పీఎం మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారు.. పీఎం కిసాన్‌పై మమతా బెనర్జి ఫైర్