MP Bypoll: ఈవీఎం ట్యాంపరింగే బీజేపీ విజయానికి కారణం: దిగ్విజయ్ సింగ్

దేశవ్యాప్తంగా ఇవాళ ఎన్నికల ఫలితాలలో మరోసారి ఈవీఎం ట్యాంపరింగ్ చర్చకొచ్చింది. బీహార్ ఎన్నిలతో పాటు మధ్యప్రదేశ్ , ఇతర ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయానికి కారణం ఈవీఎంల ట్యాంపరింగ్ అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపిస్తున్నారు. 

Last Updated : Nov 10, 2020, 08:53 PM IST
MP Bypoll: ఈవీఎం ట్యాంపరింగే బీజేపీ విజయానికి కారణం: దిగ్విజయ్ సింగ్

దేశవ్యాప్తంగా ఇవాళ ఎన్నికల ఫలితాలలో మరోసారి ఈవీఎం ట్యాంపరింగ్ ( Evm Tampering ) చర్చకొచ్చింది. బీహార్ ఎన్నిలతో పాటు మధ్యప్రదేశ్ , ఇతర ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయానికి కారణం ఈవీఎంల ట్యాంపరింగ్ అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపిస్తున్నారు. 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ( Bihar Assembly Elections ) తో పాటు మధ్యప్రదేశ్ ( Mahdya pradesh ) రాష్ట్రంలోని 28 స్థానాలు, ఇతర ప్రాంతాల్లో కొన్ని స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. బీహార్ సహా అన్నిచోట్లా బీజేపీ విజయ దుందుభి ఎగరేసింది. మధ్యప్రదేశ్ లో జరిగిన 28 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ( Mp Bypolls ) మెజార్టీ స్థానాల్ని గెల్చుకుని ప్రభుత్వంలో బలం సాధించింది బీజేపీ. అటు ఇదే ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ చేజారిన అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. 

అయితే బీజేపీ విజయంతో కాంగ్రెస్ ( Congress party ) ఆశలు ఆవిరయ్యాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రారంభించింది. ఈవీఎంలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. బీజేపీ విజయానికి కారణం ఈవీఎం ట్యాంపరింగేనని ( Evm tampering ) కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ( Congress leader Digvijay singh ) ఆరోపించారు. చిప్‌తో కూడిన ఎలాంటి మిషన్‌ను అయినా హ్యాక్‌ చేయవచ్చని వ్యాఖ్యానించారు. అగ్రదేశాలు సైతం ఇప్పటికీ బ్యాలెట్‌ పేపర్లనే వాడుతున్నాయని, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అదే జరిగిందని దిగ్విజయ్ తెలిపారు. 

అయితే ప్రతిపక్ష పార్టీలు సాధించిన విజయాల్ని ప్రస్తావిస్తూ బీజేపీ ( Bjp ) ఈవీఎంల పనితీరును సమర్దిస్తోందని...కానీ ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఈవీఎంలను తారుమారు చేస్తున్నారని దిగ్విజయ్ ఆరోపించారు. 

మరోవైపు  బీజేపీ.. కాంగ్రెస్ నేతలైన దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ లపై మండిపడింది. రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని ఎంపీ బీజేపీ ఛీఫ్ వీడీ శర్మ దుయ్యబట్టారు. ఎంపీలో కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నేత జ్యోతిరాదిత్య సింధియా ( Jyotiraditya sindhia ) పట్టు నిలుపుకున్నారు. అతని వెంట వచ్చిన ఎమ్మెల్యేలంతా దాదాపుగా విజయం సాధించినట్టే. Also read: Bihar Election Result Live: సాయంత్రం వరకూ కౌంటింగ్.. ఆధిక్యంలో ఎన్డీఏ

Trending News