Dinosaur Eggs: డైనోసర్ గుడ్లు దొరికాయా.. ఆ భారీ ఆకారాల అసలు కథ ఇది!

‘డైనోసర్ గుడ్లు’ (రాక్షసబల్లి గుడ్లు) దొరికాయని ప్రచారం జరిగింది. ఆపై ఆ డైనోసర్ గుడ్లు (Dinosaur Eggs) ఇవేనంటూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్థానిక జియాలజీ, పురావస్తు శాస్త్ర నిపుణుల బృందం ఈ స్థలాన్ని సందర్శించి, పెరంబలూరులో లభ్యమైనవి 'డైనోసర్ గుడ్లు' కాదని స్పష్టం చేశారు. 

Last Updated : Oct 23, 2020, 12:25 PM IST
Dinosaur Eggs: డైనోసర్ గుడ్లు దొరికాయా.. ఆ భారీ ఆకారాల అసలు కథ ఇది!

తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలో ‘డైనోసర్ గుడ్లు’ (రాక్షసబల్లి గుడ్లు) దొరికాయని ప్రచారం జరిగింది. ఆపై ఆ డైనోసర్ గుడ్లు (Dinosaur Eggs) ఇవేనంటూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చివరగా తేలింది ఏంటంటే.. అవి డైనోసర్ గుడ్లు కాదని, అమ్మోనైట్ అవక్షేపాలు (Ammonite Sediments) అని నిపుణులు నిర్ధారించారు. స్థానిక జియాలజీ, పురావస్తు శాస్త్ర నిపుణుల బృందం ఈ స్థలాన్ని సందర్శించి, పెరంబలూరులో లభ్యమైనవి 'డైనోసర్ గుడ్లు' కాదని స్పష్టం చేశారు. 

 

దాదాపు 416 మిలియన్ సంవత్సరాల క్రితం డెవోనియన్ కాలంలో ఉద్భవించిన పెద్ద మరియు విభిన్న సముద్ర జాతుల సమూహం అమ్మోనైట్ (అమ్మోనాయిడ్లు) శిలాజాలు అని నిపుణుల బృందం పేర్కొంది. వీటినే డైనోసర్ గుడ్లు అని అసత్యాలు ప్రచారం చేశారని ఆ వదంతులను కొట్టిపారేశారు. కొన్ని సముద్ర జాతులు శిలాజాల రూపంలో మిగిలిపోయాయని చెప్పారు. అయితే జూన్ నెలలో ఇద్దరు విద్యార్థులు జాక్ బోన్ఫోర్, థియో వికర్స్‌కు దాదాపు 210 పౌండ్ల బరువు ఉన్న అమ్మోనాయిడ్ మిశ్రమాలు కనిపించాయి. వీటినే డైనోసర్ గుడ్లు అని స్థానికంగా ప్రచారం జరిగింది.

 

కాగా, తమిళనాడులోని అరియలూర్ మరియు పెరంబలూర్ ఒకప్పుడు సముద్రగర్భం అని నిపుణులు తెలిపారు. దాంతో మిలియన్ల సంవత్సరాల కిందట సముద్రగర్భంలో ఉండిపోయిన జీవజాలం అనంతరం కొన్ని శిలాజాలుగా మారిపోయినట్లు వివరించారు. ప్రస్తుతం కనిపించిన అమ్మోనైట్ జీవులు జీవులు ఆక్టోపస్, కటిల్ ఫిష్ జీవులతో దగ్గరి పోలిక కలిగి ఉంటాయని అభిప్రాయపడ్డారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News