Prabhas Birthday Celebrations: ప్రభాస్‌ పుట్టినరోజు వేడుకల్లో విషాదం, ఫ్లెక్సీ కడుతుండగా ఫ్యాన్స్‌కు కరెంట్ షాక్

Prabhas Fan Dies: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు (అక్టోబర్ 23). ‘డార్లింగ్’ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలలో విషాదం చోటుచేసుకుంది. ప్రభాస్ ప్లెక్సీలు కడుతుండగా విద్యుత్ తీగలు తగిలి ఓ అభిమాని మృతి చెందాడు (Prabhas Fan Death News), మరో నలుగురు అభిమానులు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.

Last Updated : Oct 23, 2020, 10:36 AM IST
Prabhas Birthday Celebrations: ప్రభాస్‌ పుట్టినరోజు వేడుకల్లో విషాదం, ఫ్లెక్సీ కడుతుండగా ఫ్యాన్స్‌కు కరెంట్ షాక్

Happy Birthday Prabhas | టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు (అక్టోబర్ 23). సాధారణంగా తమ అభిమాన హీరో పుట్టినరోజు గానీ, కొత్త సినిమా గానీ రిలీజ్ అయిందంటే సందడి చేసేది వారి అభిమానులే. కానీ కొన్నిసార్లు అవి వారి ప్రాణాల మీదకి తెస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది.  ‘డార్లింగ్’ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలలో విషాదం చోటుచేసుకుంది. ప్రభాస్ పుట్టినరోజు ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ తీగలు తగిలి ఓ అభిమాని మృతి చెందాడు, మరో నలుగురు అభిమానులు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.

 

తూర్పు గోదావరి జిల్లా యద్దనపూడి మండలం పూనురులో ఈ ఘటన జరిగింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పూనురులోని ఓ కాలనీలో కొందరు అభిమానులు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలో కరెంట్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై వంకాయలపాటి సుగుణరావు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో గాయపడ్డ మరో నలుగురు ప్రభాస్ అభిమానులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.

 

ఫ్లెక్సీ కడుతూ ఓ వ్యక్తి చనిపోవడంతో స్థానికంగా పూనురులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉసిరిపాటి అసిరి, వంకాయలపాటి సుమంత్‌, బేతపూడి వాసు, చింతల వాసు అనే ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.  

 
కాగా, గతేడాది సాహో సినిమా ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ తీగలు తగిలి మహబూబ్‌నగర్‌లో ప్రభాస్ అభిమాని చనిపోయాడు. నాలుగేళ్ల కిందట ప్రభాస్ జన్మదిన వేడుకల సందర్భంగా ఇలాంటి ఘటన జరగడం తెలిసిందే. నిజామాబాద్‌ జిల్లాలో ప్రశాంత్‌ (19) అనే యువకుడు ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ వైర్లు తాకాయి. షాక్‌కు గురై ప్రశాంత్ మరణించాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News