జూలై 27న అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి సోమవారం కొంత విషమించినట్టు నిన్న కావేరి ఆస్పత్రి వర్గాలు చేసిన ప్రకటన ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం వరకు ఆయన కోలుకుంటున్నట్టు తెలియడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న అభిమానులను సోమవారం కావేరి ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ మళ్లీ ఆందోళనలోకి నెట్టింది. 13సార్లు ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ.. ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని ఈ 93 ఏళ్ల రాజకీయ కురువృద్ధుడికి తమిళనాడులో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
Supporters gather outside Chennai's Kauvery Hospital where DMK President M. Karunanidhi is undergoing treatment. The hospital had yesterday stated a decline in his medical condition. #TamilNadu pic.twitter.com/ajMbZ01poQ
— ANI (@ANI) August 7, 2018
రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా, కవిగా, సాహిత్యవేత్తగా కరుణానిధికి భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన్ను అభిమానులు ముద్దుగా కళైగర్ అని కూడా పిలుచుకుంటుంటారు. కళైగర్ అంటే తమిళంలో కళాకారుడు అని అర్థం.