Chennai Airport: హిందీ తెలియకపోతే భారతీయులు కాదా: కణిమొళి ట్వీట్

హిందీ జాతీయ భాష ( Hindi a national language ) . కానీ ఆ అధికారికి అదే ప్రామాణికంగా అన్పించింది. హిందీ రాదని తెలుసుకుని..భారతీయులేనా అని ప్రశ్నించింది. అది కూడా ఓ ఎంపీని పట్టుకుని. తనకెదురైన విచిత్ర అనుభవంపై ఆ ఎంపీ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనమవుతోంది.

Last Updated : Aug 9, 2020, 11:05 PM IST
Chennai Airport: హిందీ తెలియకపోతే భారతీయులు కాదా: కణిమొళి ట్వీట్

హిందీ జాతీయ భాష ( Hindi a national language ) . కానీ ఆ అధికారికి అదే ప్రామాణికంగా అన్పించింది. హిందీ రాదని తెలుసుకుని..భారతీయులేనా అని ప్రశ్నించింది. అది కూడా ఓ ఎంపీని పట్టుకుని. తనకెదురైన విచిత్ర అనుభవంపై ఆ ఎంపీ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనమవుతోంది.

తమిళనాట డీఎంకే పార్టీ ( DMK ) ఎంపీ కణిమొళి ( Mp kanimozhi ) అందరికీ సుపరిచితమే. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి గారాలపట్టి. ఇంతటి ప్రాచుర్యమున్న ఎంపీకు తన రాష్ట్రంలోని చెన్నై ఎయిర్ పోర్ట్ లో విచిత్ర అనుభవం ఎదురైంది. ఢిల్లీకు వెళ్లేందుకు చెన్నై ఎయిర్ పోర్ట్ ( Chennai Airport ) కు చేరుకున్న ఎంపీను.. ఎయిర్ పోర్ట్ లో పనిచేసే ఓ మహిళా సీఐఎస్ఎఫ్ అధికారి ( CISF Officer ) ప్రశ్నించిన తీరు వివాదాస్పదమైంది. తనకెదురైన విచిత్ర అనుభవాన్ని కణిమొళి ట్వీట్ చేయడం సంచలనమైందిప్పుడు. అసలేం జరిగిందంటే…

తనకు హిందీ రాదని..ఇంగ్లీష్ లేదా తమిళంలో మాట్లాడమని చెన్నై విమానాశ్రయంలో ఓ మహిళా అదికారిని ఎంపీ కణిమొళి కోరారు. దానికామె సమాధానంగా...మీరు భారతీయులేనా అని ప్రశ్నించడంతో కణిమొళి అవాక్కయ్యారు. భారతీయులుగా ఉండటమంటే..హిందీ తెలిసుండటమే అర్హతా అనేది తెలుసుకోవాలనుకుంటున్నట్టు కణిమొళి ( Kanimozhi ) ఆమెను ప్రశ్నించారు. తాను ఎవరన్నది మీరు నిర్ణయించలేరని..ఈ విషయంపై ఫిర్యాదు చేయనున్నట్టు కణిమొళి చెప్పారు. Also read: Kerala Flight crash: ఆ రన్ వే సేఫ్ కాదని గతంలోనే హెచ్చరించారా

అనంతరం ఢిల్లీలో ( Delhi ) ల్యాండ్ అవగానే సీఐఎస్ఎఫ్ అధికారులు కణిమొళిని కలిశారు. ఓ ప్రత్యేక భాష గురించి చెప్పడం తమ ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. Also read: Refugee camp: శరణార్ధి కుటుంబంలో 11 మంది మరణం

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x