ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మీద విమర్శలు కురిపిస్తున్న రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. అయోధ్యలో దీపావళి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్న సందర్భంలో తన మీద వచ్చిన విమర్శలకు బదులిస్తూ.. ఇది తన నమ్మకానికి సంబంధించిన విషయమని, దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని తెలియజేశారు. నా నమ్మకాన్ని శంకించాల్సిన అవసరం లేదని అన్నారు.
దీపావళి సందర్భంగా తను అయోధ్యను సందర్శించడం వెనుక మరో కారణం కూడా ఉందన్నారు. ఈ పర్వదినం సందర్భంగా పోటెత్తే అశేష జనావళిని భద్రతా దళాలు ఎలా నియంత్రిస్తున్నాయో చూడాల్సిన నైతిక బాధ్యత ఒక సీఎంగా తన మీద ఉందన్నారు. అదేవిధంగా దేశంలో శాంతి, భద్రత, ప్రగతి పరిఢవిల్లాలని కోరుతూ ప్రార్థనలు చేయడానికి తాను అయోధ్యకు వచ్చానని తెలిపారు.
ఆదిత్యనాథ్ తన అయోధ్య పర్యటనలో భాగంగా హనుమాన్‌గ్రహీ ఆలయం, సుగ్రీవ ఆలయంతో పాటు రామ జన్మభూమిని కూడా సందర్శించారు. ఆ తర్వాత తన నియోజకవర్గమైన గోరఖ్ పూర్‌లో జరిగే ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లారు.
Meri vyaktigat aastha bhi hai,us mein vipaksh kaise hastakshep kar sakta hai?-UP CM on #Diwali celebrations in Ayodhya/Ram Janmabhoomi visit pic.twitter.com/oUMhUdWOFZ
— ANI UP (@ANINewsUP) October 19, 2017