ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం క్లీన్ చిట్

ఎన్నికల కోడ్ ఉల్లంఘణ ఫిర్యాదుపై ప్రధాని మోదీకి ఈసి క్లీన్ చిట్

Last Updated : Mar 29, 2019, 05:40 PM IST
ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం క్లీన్ చిట్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇచ్చింది. మిషన్ శక్తి ఆపరేషన్ విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్టు అవదని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ ఇస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో తన పార్టీ పేరు ప్రస్తావించడం కానీ లేదా పార్టీకి ఓటు వేయాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేయడం వంటివి కానీ చేయలేదని ఎన్నికల సంఘం ఈ ప్రకటనలో పేర్కొంది.

Trending News