Election Commission: దేశంలో కోవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజుకు 3.5 లక్షల కేసులు నమోదవుతున్న పరిస్థితి. దేశంలో కరోనా విజృంభణకు ఎన్నికల కమీషన్‌ను తప్పుబడుతూ మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యల నేపధ్యంలో ఎన్నికల కమీషన్ అప్రమత్తమైంది.
కరోనా వైరస్ మహమ్మారి (Corona virus) అత్యంత భయానకంగా మారింది. దేశంలో వైరస్ విజృంభణతో పరిస్థితులు దారుణంగా మారాయి. ప్రతిరోజూ 3.5 లక్షల కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందనేది అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలోనే మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఎన్నికల కమీషన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ వ్యాప్తికి ఈసీ కారణమని..హత్య కేసు పెట్టాలని సూచించింది. ఓ వైపు కోవిడ్ వైరస్ విజృంభిస్తుంటే ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి ఎలా ఇస్తారంటూ అగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కౌంటింగ్‌కు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని..లేకపోతే కౌంటింగ్ నిలిపివేస్తామని కూడా హెచ్చరించింది.
మద్రాస్ హైకోర్టు హెచ్చరికల నేపధ్యంలో ఎన్నికల కమీషన్ ( Election Commission) అప్రమత్తమైంది. మే 2 న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ ( Election Counting)కు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ (Vaccination) రెండు డోసులు తీసుకున్నవారు, కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ (Covid Negative Report) ఉన్నవారినే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపింది. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద జన సమూహానికి అనుమతి లేదు. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలనుకునేవారు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్, రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ( Vaccination Certificate) కౌంటింగ్‌కు 48 రోజుల ముంద సంబంధిత అధికారులకు అందించాల్సి ఉంటుంది. కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను మూడ్రోజుల ముందే అందించాలి. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మే 2న జరగనుంది.
Also read: Sputnik v vaccine: మరో మూడ్రోజుల్లో ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్, ఇవీ ప్రత్యేకతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook