మాజీ కేంద్ర మంత్రి రఘునాథ్ కన్నుమూత

మాజీ కేంద్ర మంత్రి రఘునాథ్ ఝా (78) కన్నుమూశారు.  గత కొంత కాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ఆయన పరిస్థితి విషమించి మరణించారు.  ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా రఘునాథ్ కు భార్య దీవ్ కర్నా దేవి, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా ఝా మృతిపై లాలూ ప్రసాద్ యాదవ్ తో సహా రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Last Updated : Jan 15, 2018, 11:15 AM IST
మాజీ కేంద్ర మంత్రి రఘునాథ్ కన్నుమూత

ఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి రఘునాథ్ ఝా (78) కన్నుమూశారు.  గత కొంత కాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ఆయన పరిస్థితి విషమించి మరణించారు.  ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా రఘునాథ్ కు భార్య దీవ్ కర్నా దేవి, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా ఝా మృతిపై లాలూ ప్రసాద్ యాదవ్ తో సహా రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

రఘునాథ్ ఝా పోలిటికల్ కెరీర్..
బీహారకు చెందిన రఘునాథ్ ఝా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. బెతయ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన.. 2004లో ఏర్పడిన యూపీఏ కొలువులో మంత్రి పదవి  దక్కించుకున్నారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్, జనతా పార్టీ, జనతాదళ్ (యు)లలో సైతం సేవలందించారు.

Trending News