దాణా కుంభకోణంలో తీర్పు నేడే

శనివారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దాణా(గడ్డి) కుంభకోణంలో తీర్పు వెల్లడిస్తున్నది. ఈ కుంభకోణంలో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Last Updated : Dec 23, 2017, 11:57 AM IST
దాణా కుంభకోణంలో తీర్పు నేడే

రాంచీ: శనివారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దాణా(గడ్డి) కుంభకోణంలో తీర్పు వెల్లడిస్తున్నది. ఈ కుంభకోణంలో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

2జీ, ఆదర్శ్ కుంభకోణంలో ఇతర నిందితులవలె తాము కూడా పశుగ్రాస కుంభకోణం (దాణా) కేసులో క్లీన్ చీట్ పొందుతామని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ శుక్రవారం ఆశాభావం వ్యక్తం చేశారు. "మేము న్యాయవ్యవస్థను నమ్ముతాము, గౌరవిస్తాము. బీజేపీ యొక్క కుట్రలు పని చెయ్యవు" అని ప్రసాద్ అన్నారు.

అటల్ బిహారీ వాజపేయి కాలం నుండి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాలు గత 25 ఏళ్ల నుంచి నన్ను, నా కుటుంబాన్ని సీబీఐను అడ్డంపెట్టుకొని వేధిస్తున్నట్లు చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేడు తీర్పును వినడానికి కుమారుడు తేజష్వి యాదవ్ తో కలిసి రాంచీకి బయల్దేరారు. 

దెవొఘర్ ట్రెజరీ నుంచి 95 లక్షల రూపాయలను దాణా కోసం అక్రమంగా డ్రా చేసినందుకు 1997లో దాణా కేసులో లాలూ పేరును చార్జిషీట్లో దాఖలు చేసింది సీబీఐ. ఈ కేసు విచారణ సమయంలో 11 మంది మరణించారు. ఒకరు నేరాన్ని ఒప్పుకున్నందుకు సీబీఐ అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ బీహార్ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాతో సహా మరో నలుగురికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

Trending News