కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి సాధారణ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్భంగా ..ఆమె మరోసారి సంప్రదాయానికే పెద్ద పీట వేశారు. కేంద్ర బడ్జెట్ అంటే ... దాదాపుగా పేద్ద లెక్కల పద్దుగా అందరూ భయపడతారు. కానీ దాన్ని కూడా చాలా సాధారణంగా తీసుకున్న నిర్మలా సీతారామన్ .. భారతీయ పురాతన సంప్రదాయ పద్ధతిని అవలంభించారు.
నిజానికి గతంలో కేంద్ర ఆర్ధిక మంత్రులు బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు .. ఓ పెద్ద బ్రీఫ్ కేస్ .. లేదా బ్యాగ్ తీసుకుని వచ్చే వారు. పార్లమెంట్ బయట బడ్జెట్ బ్యాగ్‌తో పాటు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చే వారు. కేంద్ర ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సంప్రదాయాన్ని మార్చేశారు. స్మార్ట్‌గా కనిపించే బ్యాగ్‌లు , బ్రీఫ్ కేస్‌లకు స్వస్తి పలికారు. వాటి స్థానంలో పురాతన భారతీయ సంప్రదాయానికి ఆమె శ్రీకారం చుట్టారు. భారతీయ సంప్రదాయంలో బడ్జెట్ కోసం 'చిట్టా పద్దుల' పుస్తకాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అదే పురాతన భారతీయ సంప్రదాయంలో ఉపయోగించే 'చిట్టా పద్దుల' పుస్తకాన్నే ఉపయోగించడం విశేషం. 'చిట్టా పద్దుల' పుస్తకాన్ని జనపనారతో తయారు చేసిన సంచిలో తీసుకుని వచ్చారు. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తోపాటు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో ఆమె 2020-2021 సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
అంతకుముందు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర కేబినెట్ భేటీలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలిశారు.
#WATCH Delhi: Finance Minister Nirmala Sitharaman and MoS Finance Anurag Thakur arrive at the Parliament, to attend Cabinet meeting; Presentation of Union Budget 2020-21 at 11 am pic.twitter.com/J217IqrVUr
— ANI (@ANI) February 1, 2020