రాఖీ పండగొచ్చింది.. బంగారం ధర పెరిగింది

రాఖీ పర్వదినం నేపథ్యంలో పెరిగిన బంగారం ధరలు

Last Updated : Aug 26, 2018, 05:11 PM IST
రాఖీ పండగొచ్చింది.. బంగారం ధర పెరిగింది

ఆగస్టు 26న రాఖీ పర్వదినం నేపథ్యంలో మార్కెట్‌లో బంగారం అమ్మకాలు పుంజుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలకు కూడా రెక్కలొచ్చాయి. నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు పెరగడంతో ఒక్కసారిగా బంగారానికి డిమాండ్ ఏర్పడింది. శనివారం నాడు బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.250 పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.30,900 మార్కుని చేరింది. బంగారం ధరల్లో పెరుగుదలకు రాఖీ పండగ ఓ కారణమైతే, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండికి డిమాండ్ ఏర్పడటం మరో కారణమైంది. 

రాఖీ పండగకు బహుమతుల రూపంలో నాణేలు ఇచ్చే సంస్కృతి ఉండటంతో నాణెల తయారీదారుల నుంచి వెండికి భారీ డిమాండ్ పెరిగింది. ఫలితంగా వెండి ధరల్లోనూ పెరుగుదల కనిపించింది. వెండి కిలోకు రూ.400 పెరిగి రూ.38,250కి చేరుకుంది. 

Trending News