Railway: రైలు ప్రయాణీకులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏఐ టెక్నాలజీతో అత్యాధునిక సదుపాయం...

CC Cameras in Rail: ఎక్కువశాతం మంది భారతీయులు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. అయితే, మీరు కూడా రైలు ప్రయాణం చేసేవారా? అయితే, కేంద్రం మీకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఏఐ పవర్‌ టెక్నాలజీతో భద్రమైన ప్రయాణానికి ఇది దోహదం చేస్తుంది. ఈ విషయాన్ని బుధవారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్వయంగా ప్రకటించారు.

Written by - Renuka Godugu | Last Updated : Sep 12, 2024, 06:00 AM IST
Railway: రైలు ప్రయాణీకులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏఐ టెక్నాలజీతో అత్యాధునిక సదుపాయం...

CC Cameras in Rail: ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, రైళ్లలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్లకు కేంద్రం తీపికబురు అందించింది. రైళ్లలో అత్యాధునిక టెక్నాలజీని ఏర్పాటు చేస్తూ ప్రయాణీకులకు సురక్షితమైన రైలు ప్రయాణాన్ని అందించనుంది. మనం అప్పుడప్పుడు రైళ్లలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూశాం. దీనికి చెక్‌ పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ముఖ్యంగా రైలు ప్రయాణం చేసేటప్పుడు ఇకపై ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా కేంద్రం నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది.

మన దేశంలో ప్రతిరోజూ కొన్ని లక్షల మంది రైలు ప్రయాణం చేస్తారు. దీంతో సుదీర్ఘ గమ్యస్థానాన్ని తక్కువ సమయంలో చేరుస్తుంది. రైలు ఛార్జీలు కూడా అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎక్కువశాతం మంది భారతీయులు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. అయితే, మీరు కూడా రైలు ప్రయాణం చేసేవారా? అయితే, కేంద్రం మీకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఏఐ పవర్‌ టెక్నాలజీతో భద్రమైన ప్రయాణానికి ఇది దోహదం చేస్తుంది. ఈ విషయాన్ని బుధవారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్వయంగా ప్రకటించారు.

ముఖ్యంగా ప్రయాణీకులకు భద్రత కల్పించడానికి, తరచూ జరుగుతున్న ట్రైన్‌ యాక్సిడెంట్లను నివారించడానికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ విషయం వెల్లడించారు. కేంద్రం ముఖ్యంగా రైల్వే భద్రత విధానాలకు ఓ పెద్ద నిర్ణయం తీసుకుందని చెప్పారు. భారతీ రైల్వే 75 లక్షల ఏఐ పవర్‌ సీసీటీవీ కెమెరాలను ఇక ప్రతి రైళ్లలో ఏర్పాటు చేయనుంది. రైలు కోచ్‌లతోపాటు లోకోమోటీవ్‌ ఇంజిన్‌లలో కూడా పైలట్‌ను అలెర్ట్‌ చేసేందుకు కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చదవండి: దీపికా- రణవీర్‌ల బేబీ ఫోటో వైరల్‌.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

ఈ కొత్త భద్రత చర్యలపై అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ ఈ ఏఐ సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై తుది నిర్ణయం త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని చెప్పారు. ఇలా ప్రయాణీకుల భద్రతా దృష్ట్యా ఏర్పాటు చేయనున్న 75 లక్షల సీసీ కెమెరాలకు గాను దాదాపు 15 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అంతేకాదు రైళ్లలో ఏర్పాటు చేయనున్న ఈ కెమెరాలు ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే ట్రాక్‌ చేసి డ్రైవర్‌ను అలెర్ట్‌ చేస్తుందట.భారతీయ రైల్వే 40 వేల కోచులు, 14 వేల లోకోమోటీవ్‌లు, 6 వేల ఈఎంయూలకు ఈ ఏఐ ఆపరేట్‌ చేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతుంది.

ఇదీ చదవండి:  మగువా ఓ మగువా సీరియల్‌ చెంచలమ్మ.. రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారో తెలుసా? పిక్స్‌ వైరల్‌ ..

కేవలం రైలు కోచుల్లో మాత్రమే కాదు ఇండియన్‌ రైల్వే ట్రాకుల వద్ద కూడా సెక్యూరిటీని పెంచే యోచనలో ఉంది. ఇక రైలు ట్రాకులగా అడ్డుగా ఏ వస్తువులు పెట్టినా వెంటనే పైలట్‌ అలెర్ట్‌ అయిపోవచ్చు. ఎందుకంటే ఇంజిన్‌కు రెండు వైపులా కూడా ఈ కెమెరాలను ఫిక్స్‌ చేయనున్నారట అంటే ఇంజిన్‌కు ఫ్రంట్‌, రేర్‌ కెమెరాలను పెడతారు. మూడు నెలల్లో టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తవుతుందన్నారు మంత్రి. ఈ కెమెరాలు ఏర్పాటు చేసి దీన్ని అనుసందిస్తూ ఓ డేటా సెంటర్‌ ను కూడా ఏర్పాటు చేయనున్నారట. కెమెరాల ఫీడ్‌ను రికార్డు చేస్తారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News