GRP: 18కిలోల బంగారం స్వాధీనం

పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌లో పెద్ద మొత్తంలో బంగారం (Gold), నగదు (Cash) పట్టుబడింది. శనివారం పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి నుంచి 18 కిలోల బంగారం, రూ.2.30 లక్షల నగదును రైల్వే పోలీసులు (GRP) స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Oct 11, 2020, 12:28 PM IST
GRP: 18కిలోల బంగారం స్వాధీనం

GRP apprehended a person with 18.39 kgs of gold and Rs 2.30 lakhs in cash: పాట్నా: బీహార్ (Bihar) రాష్ట్రంలోని పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌లో పెద్ద మొత్తంలో బంగారం (Gold), నగదు (Cash) పట్టుబడింది. శనివారం పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి నుంచి 18 కిలోల బంగారం, రూ.2.30 లక్షల నగదును రైల్వే పోలీసులు (GRP) స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పోలీసు అధికారి వివరాలను వెల్లడించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి బ్యాగ్‌లో 18.39 కిలోల బంగారం, రూ .2.30 లక్షల నగదును తీసుకెళ్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ కేసును ఆదాయపు పన్ను శాఖల అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని వెల్లడించారు. అయితే ఈ బంగారం, నగదులో ఎవరెవరి పాత్ర ఉందో అనే విషయంపై Income Tax department అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. Also read: Amitabh Bachchan: 78వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ షెహన్‌షా

gold-cash-patnaఇదిలా ఉంటే.. మరో సంఘటనలో ఒక ప్రయాణికుడి నుంచి 24 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు జీఆర్‌పీ పోలీసులు (GRP Police) వెల్లడించారు. ఓ వ్యక్తి తరలిస్తుండగా పట్టుకున్నామని మద్యాన్ని స్వాధీనం చేసుకోని.. నిందితుడిని అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.  Also read : China on coronavirus: కరోనావైరస్ పుట్టింది చైనాలో కాదు: చైనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News