/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

గుజరాత్ తుదిదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం దకోర్ లోని రంచ్చోద్జీ ఆలయాన్ని సందర్శించారు. రాహుల్ ఉదయం 11 గంటల ప్రాంతంలో అశోక్ గెహ్లాట్, మరికొంతమంది నేతలతో కలిసి ఆలయంలోని కృషుడి ఆశీర్వాదం తీసుకున్నారు.. కృషుడిని పూజించారు. ఆయన చేతికి తెల్లజెండా ఇచ్చారు. 

 

అయితే రాహుల్ ఆలయం నుండి బయటకు వచ్చేటప్పుడు, చుట్టూ ఉన్న జనం మోదీ.. మోదీ.. అంటూ అరిచారు. రాహుల్ చిరునవ్వు నవ్వి అక్కడి నుండి కారులో వెళ్లిపోయారు. 

 

ఇలా రాహుల్ చేదు అనుభవానికి గురికావడం లేదేమో తొలిసారికాదు. గుజరాత్ టెక్స్ టైల్స్ మార్కెట్ లో వర్తకులు రాహుల్ గాంధీ సందర్శించినప్పుడు కూడా మోదీ మోదీ అంటూ అరిచారని ఢిల్లీ బిజేపి నేత తేజిందర్ బగ్గా ఒక వీడియోను ట్వీట్ చేశారు. 

నేటి రాహుల్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ 

* గుజరాత్లో నాలుగు ఎన్నికల బహిరంగ సమావేశాలు రాహుల్ ప్రసంగిస్తారు.

* దకోర్ లో బహిరంగ సమావేశంలో ప్రసంగించిన తర్వాత, రాహుల్ గాంధీ ఆరావళి జిల్లాలోని శమ్లాజీ ఆలయాన్ని సందర్శించి, ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. ఆరావళి తరువాత రాహుల్ బనస్కాంతా, గాంధీ నగర్ లో ఎన్నికల ర్యాలీలలో ఆయన ప్రసంగిస్తారు. 

 

మరోవైపు బీజేపీ కూడా ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగిస్తున్నది. బీజేపీ తరఫున, ప్రధాని నరేంద్ర మోదీ కూడా  నేడు నాలుగు ప్రదేశాల్లో ఎన్నికల బహిరంగ సభలలో ప్రసంగిస్తారు. పాలన్పూర్, సనంద్, పంచమహల్, వడోదరలోని కలోల్ లో ర్యాలీలు చేస్తారు. తొలి దశ ఎన్నికల్లో 68 శాతం మంది ఓటర్లు శనివారం సాయంత్రం ఐదు గంటల ఓటు వేశారు. ఈ దశలో, 19 జిల్లాలలో 89 సీట్లకు ఓటింగ్ జరిగింది. రెండవ దశలో 93 సీట్లు డిసెంబర్ 14న జరుగుతాయి. ఎన్నికల ఫలితం డిసెంబరు 18న ప్రకటించబడుతుంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా ఈ రోజు ప్రకటించనున్నాయి.

Section: 
English Title: 
gujarat-elections-2017-rahul-gandhi-offered-prayers-in-shree-ranchhodji-temple
News Source: 
Home Title: 

రాహుల్ కు గుజరాత్ ఎన్నికల్లో చేదు అనుభవం

రాహుల్ కు గుజరాత్ ఎన్నికల్లో చేదు అనుభవం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes