Mumbai Rains: ముంబై ఆగమాగం..ముంచిన వాన..

Mumbai Rains: దేశ ఆర్ధిక రాజధాని ముంబైని వరుణుడు ముంచెత్తాడు.  రాత్రి నుంచి కురుస్తున్న వానలు నగరాన్నిముంచెత్తాయి.  నగర రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో నిన్న మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 26, 2024, 10:49 AM IST
Mumbai Rains: ముంబై ఆగమాగం..ముంచిన వాన..

Mumbai Rains: ఇవాళ తెల్లవారుఝాము వరకు వాన కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి జన జీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల రహదారులపైకి వరద నీరు చేయడంతో వాహనదారులు తీవ్ర అవస్థల పాలయ్యారు. ములుంద్, దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఠాణెలోని ముంబ్రా బైపాస్‌పై కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతంలో 3 గంటలకు పైగా ట్రాఫిక్‌ స్తంభించింది. వర్షాల కారణంగా దాదాపు 14 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రేపటి వరకు ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముంబయి, శివారు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని పోలీసులు కీలక సూచనలు చేశారు.

ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం  హెచ్చరికలు జారీ చేసింది. ముంబై పొరుగు జిల్లాలను కూడా అప్రమత్తం చేసింది. అత్యంత భారీ వర్షాలు కురవచ్చు.  ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాలకు తీవ్ర భారీ వర్షాల ముప్పు ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. దీంతో తీవ్ర వర్షాలు, వరదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని  నగరంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

యూట్యూబర్ హర్షసాయి అరెస్ట్ కోసం స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి విశాఖకు వెళ్లిన ఓ ఎస్సై స్థాయి అధికారి, ఇద్దరు కానిస్టేబుల్స్ హర్షసాయితో పాటు...అతని తండ్రి రాధాకృష్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భీమిలి, ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో హర్షసాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతే కాదు అతని బంధువుల, స్నేహితులను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాదిని హర్ష సాయి నియమించుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News