Vaccination Certificate: వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లో తప్పులున్నాయా..ఇలా సరి చేసుకోండి

Vaccination Certificate: మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా లేదా. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకున్నారా. తప్పులున్నాయని వర్రీ అవుతున్నారా..ఆ తప్పుల్ని ఇలా సరిచేసుకోండి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 10, 2021, 10:18 AM IST
  • వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లో తప్పులు సరిదిద్దుకునేందుకు కొత్త ఫీచర్
  • రైజ్ ఏన్ ఇష్యూ సహాయంతో తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం
  • పుట్టిన తేదీ, జెండర్, పేరు వివరాల్ని ఒకసారి మాత్రమే సరిచేసుకునేందుకు అవకాశం
Vaccination Certificate: వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లో తప్పులున్నాయా..ఇలా సరి చేసుకోండి

Vaccination Certificate: మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా లేదా. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకున్నారా. తప్పులున్నాయని వర్రీ అవుతున్నారా..ఆ తప్పుల్ని ఇలా సరిచేసుకోండి..

కరోనా సంక్షోభ (Corona Crisis) సమయంలో ఇప్పుడు వ్యాక్సినేషన్ చాలా అవసరంగా మారింది. అంతకంటే అవసరం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్. విదేశీ ప్రయాణాలు చేయాలన్నా లేదా మెడికల్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాలన్నా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా మారింది. ఈ తరుణంలో వ్యాక్సిన్ వేయించుకోవడం కంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ సక్రమంగా ఉందో లేదో చూసుకోవడం అవసరం. మీరు వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే వెంటనే సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఒకవేళ ఆ సర్టిఫికేట్‌లో తప్పులు ఉంటే కంగారుపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ అంతట మీరే ఆ తప్పుల్ని సరి చేసుకుని..తిరిగి సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే..

కోవిన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తప్పుల్ని సవరించుకునేందుకు కొత్త ఫీచర్ (New Feature in Cowin platform) ప్రవేశపెట్టారు. రైజ్ ఏన్ ఇష్యూ (Raise an issue) అనేది ఆ కొత్త ఫీచర్. ఈ ఫీచర్ సహాయంతో తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు. పేరు, పుట్టిన తేదీ, జెండర్ లాంటి అంశాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు. అయితే ఒకసారి మాత్రమే ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తప్పుల్ని సరిచేయడం చాలా సులభమే.

ముందుగా www.cowin.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. సైన్ అయ్యేందుకు మీ 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తరువాత అక్కౌంట్ డీటైల్స్‌కు వెళ్లాలి. ఒక డోసు లేదా రెండు డోసులు తీసుకున్నవారికి రైజ్ ఏన్ ఇష్యూ బటన్ కన్పిస్తుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే కరెక్షన్ ఇన్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ కన్పిస్తుంది. మీ సర్టిఫికేట్‌లో ఎక్కడ తప్పులున్నాయో చూసి వాటిని ఎడిట్ చేసుకోవాలి. అనంతరం తప్పుల్లేని సర్ఠిఫికేట్ ( Vaccine Certificate) డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Also read: Covid19 Vaccine: కేంద్ర భద్రతా బలగాల ఆధీనంలో భారత్ బయోటెక్ కంపెనీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News