"నేనే కల్కి భగవాన్" - ప్రభుత్వ ఉద్యోగి రాసిన విచిత్ర లేఖ

గుజరాత్‌లో సర్దార్ సరోవర్ పునరావాస ఏజెన్సీకి సూపరింటెండెంట్ ఇంజినీరుగా పనిచేస్తున్న రమేష్ చంద్ర గత కొన్ని నెలలుగా ఆఫీసుకు రావడం మానేశారు. 

Last Updated : May 19, 2018, 11:08 AM IST
"నేనే కల్కి భగవాన్" - ప్రభుత్వ ఉద్యోగి రాసిన విచిత్ర లేఖ

గుజరాత్‌లో సర్దార్ సరోవర్ పునరావాస ఏజెన్సీకి సూపరింటెండెంట్ ఇంజినీరుగా పనిచేస్తున్న రమేష్ చంద్ర గత కొన్ని నెలలుగా ఆఫీసుకు రావడం మానేశారు. దాంతో ప్రభుత్వం అతనికి షోకాజ్ నోటీసులు పంపించింది. ఆ నోటీసులకు సమాధానం ఇవ్వకపోతే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుందని కూడా తెలిపింది. అయితే ఆ నోటీసులకు ఆ ప్రభుత్వ ఉద్యోగి పంపిన సమాధానం చదివి విస్తుపోవడం అధికారుల వంతైంది.

"మీకో విషయం తెలుసా.. ఇన్నేళ్లు మీతో కలిసి పని చేసిన నేను సాక్షాత్తు దేవుడిని. నన్ను కల్కి భగవాన్ అంటారు. శ్రీమహావిష్ణువు అవతారం నేను. మీకు ఆ విషయం త్వరలోనే తెలుస్తుంది. నేను సెలవు పెట్టి ప్రార్థనలు, యాగాలు చేస్తున్నాను కాబట్టే దేశంలో పంటలు బాగా పండి జనాలు సుఖంగా జీవిస్తున్నారు. ఇంత బిజీగా ఉంటున్నాను కాబట్టే ఉద్యోగానికి సెలవు పెట్టాల్సి వచ్చింది" అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

అయితే ఉద్యోగానికి పర్మిషన్ లేకుండా సెలవు పెట్టడమే కాకుండా.. ఇలాంటి విచిత్రమైన లేఖ రాసినందుకు ఆ ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు అధికారులు. ఒక సూపరింటెండెంట్ స్థాయిలో ఉండి అత్యవసర సమయాల్లో ముందస్తు సమాచారం లేకుండా ఆయన సెలవు పెట్టడం వల్ల చాలా పనులు పెండింగ్‌లో పడిపోయాయని.. వాటికి ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా అధికారులు పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Trending News