4102 పీఓ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అలహాబాద్ బ్యాంక్‌లో 784, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 965, కెనరా బ్యాంక్లో 1200, కార్పొరేషన్ బ్యాంక్ లో 84, యూసీవో బ్యాంక్ లో 550, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 519 ఖాళీలు ఉన్నాయి.
డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఈ నెల 14 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరించి.. అక్టోబర్ లో ప్రిలిమినరీ, నవంబర్ లో మెయిన్స్ నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100, ఇతరులకు రూ.600.
రెండంచెల రాతపరీక్ష-ఆన్‌లైన్ (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూల ద్వారా పీఓ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్‌లో: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణలో: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
మెయిన్స్ పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్
మరింత సమాచారం కోసం http://www.ibps.in లోకి వెళ్లి చూసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.