India - Bhutan rail link: ఇండియా - భూటాన్ మధ్య రైల్వే లింక్.. ఎప్పుడు పూర్తి కానుందంటే..

India - Bhutan rail link: భారత్ - భూటాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, వస్తుసామాగ్రి ఎగుమతులు, సాంస్కృతిక మార్పిడి, తదితర అంశాల్లో రైల్వే ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది అని రెండు దేశాలు భావిస్తున్నాయి. 2018లో భూటాన్ ప్రధాని భారత్‌కి వచ్చిన సందర్భంగా ఈ ప్రాజెక్టుపై చర్చలు ఊపందుకున్నాయి.

Written by - Pavan | Last Updated : Sep 9, 2023, 09:34 PM IST
India - Bhutan rail link: ఇండియా - భూటాన్ మధ్య రైల్వే లింక్.. ఎప్పుడు పూర్తి కానుందంటే..

India - Bhutan Rail Link: ఇండియాను, పొరుగునే ఉన్న భూటాన్ దేశాన్ని కలుపుతూ ఓ ఇంటర్నేషనల్ రైల్వే ట్రాక్ అందుబాటులోకి రానుంది. ఈశాన్య భారతంలో రైల్వే సదుపాయాలను విస్తరించే ప్రణాళికల్లో భాగంగా భారత ప్రభుత్వం రూ. 120 బిలియన్ రూపాయలను కేటాయించి మరీ భారత్ ఈ రైల్వే లైన్ నిర్మించనున్నట్టుగా భూటాన్ లైవ్ శనివారం వెల్లడించింది. భూటాన్‌కు చెందిన మీడియా సంస్థ కథనం ప్రకారం భారత ప్రభుత్వం నిధులతో నిర్మిస్తున్న 57.5 కిలోమీటర్ల రైలు మార్గం అస్సాంలోని కోక్రాఝర్‌ను భూటాన్‌లోని సర్పాంగ్‌లోని గెలెఫును అనుసంధానం చేయనుంది. 2026 నాటికి ఈ రైల్వే ప్రాజెక్ట్ పూర్తి కానుంది అని తెలుస్తోంది.

నెల రోజుల క్రితమే భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఎస్ జైశంకర్ ఇండియా - భూటాన్ మధ్య ఈ ప్రతిష్టాత్మక రైల్వే లైన్ కి సంబంధించి జరుగుతున్న చర్చల గురించి సూచనప్రాయకంగా పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మీడియాతో జై శంకర్ మాట్లాడుతూ, " అస్సాం నుండి ఇండియా - భూటాన్ ను అనుసంధానం చేస్తూ రెండు దేశాల మధ్య రైల్వే లైన్ కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం ద్వారా భూటాన్ పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు అస్సాంకు సైతం ప్రయోజనం చేకూరనుంది. అస్సాంలోని కోక్రాఝర్ కి భారత్ - భూటాన్ సరిహద్దుల్లో భూటాన్ భూభాగంలో ఉన్న గెలెఫు మధ్య ప్రతిపాదిత రైల్వే లింక్ రెండు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటక రంగం అభివృద్ధికి బాటలు వేయనుంది.

భారత్ - భూటాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, వస్తుసామాగ్రి ఎగుమతులు, సాంస్కృతిక మార్పిడి, తదితర అంశాల్లో రైల్వే ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది అని రెండు దేశాలు భావిస్తున్నాయి. 2018లో భూటాన్ ప్రధాని భారత్‌కి వచ్చిన సందర్భంగా ఈ ప్రాజెక్టుపై చర్చలు ఊపందుకున్నాయి. 

కోక్రాఝర్ - గెలెఫు రైల్వే లైన్ నిర్మాణం భవిష్యత్తులో మరిన్ని రైల్వే లైన్ ప్రాజెక్టులకు మార్గం సుగమం కానుంది. భారత్ - భూటాన్ మధ్య 2005లో ఒక అవగాహనా ఒప్పందం జరిగింది. ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేసినప్పుడే రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న పట్టణాలను రైల్వే నెట్‌వర్క్ ద్వారా అనుసంధానం చేయాలనే ఆలోచనకు మొగ్గతొడిగింది.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x