Indian Navy Recruitment 2022: 10 పాస్​తో నేవీలో భారీగా ఉద్యోగ అవకాశాలు!

Indian Navy Recruitment 2022: ఇండియన్ నేవీలో భారీగా ఉద్యోగ నియమకాలు చేపట్టనుంది ప్రభుత్వం. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడు ప్రారంభం కానుంది? వేతనాలు ఎంత? అనే వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 06:05 PM IST
  • ఇండియన్ నేవీలో ఉద్యోగాలు
  • పదవ తరగతి పాస్​ అయిన వారికి అవకాశం!
  • త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
Indian Navy Recruitment 2022: 10 పాస్​తో నేవీలో భారీగా ఉద్యోగ అవకాశాలు!

Indian Navy Recruitment 2022: రక్షణ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అలర్ట్​. ఇండియన్​ నేవీలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. నేవీలో స్కిల్ల్​డ్​ ట్రేడ్స్​మెన్​ పోస్టుల కోసం ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఆసక్తి ఉన్నవారు.. ఇండియన్ నేవీ అధికారిక వెబ్​సైట్లోకి లాగిన్ అయ్యి.. అప్లయ్​ చేసుకోవచ్చని తెలిపింది.

దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? లాస్ట్  డేట్ ఎప్పుడు? వేతనం ఎంత? విద్యార్హతలు ఏమిటి? అనే వివరాలు ఇలా ఉన్నాయి.

దరఖాస్తుకు చివరి తేదీ..

నేవీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 2022 ఫిబ్రవరి 22 (సోమవారం) నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. దరఖాస్తు సబ్మిట్ చేసేందుకు చివరి తేదీ 2022 మార్చి 20.

మొత్తం 1,531 ట్రైడ్స్​మెన్​ పోస్టులకు గానూ ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో క్యాటగిరీల వారీగా రిజర్వేషన్ చేసింది నేవీ.

రిజర్వేషన్లు ఇలా..

  • జనరల్ క్యాటగిరీ-697 పోస్టులు
  • ఆర్థికంగా వెనకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్​)-141 పోస్టులు
  • ఓబీసీ- 385 పోస్టులు
  • ఎస్సీ-215 పోస్టులు
  • ఎస్టీ-93 పోస్టులు

అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసే వారు కనీసం 10 పాసవ్వాలి. దీనితో పాటు.. అభ్యర్థులు సంబందిత విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్​ ఉండాలి.

ఈ పోస్టులకు వయో పరిమితి (ఏజ్​ లిమిట్​) 18-25 సంవత్సరాలు. అయితే రిజర్వేషన్ క్యాటగిరీల వారీగా ఆయా అభ్యర్థులకు ఇందులో మినహాయింపులు ఉంటాయి.

వేతనం ఎంత?

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు వేతనం ఉంటుంది.

Also read: Viral Crime News: ఆమ్లెట్ వేసివ్వలేదని భార్య గొంతు నులిమి చంపిన భర్త..

Also read: Minor girl Gang Rape: పుట్టిన రోజున అలిగి పారిపోయిన మైనర్ బాలిక.. నమ్మించి మోసం చేసిన నలుగురు యువకులు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News