Man kills wife after she refused to make Omelette: బీహార్‌లో దారుణం వెలుగుచూసింది. భార్య ఆమ్లెట్ వేసివ్వలేదన్న కారణంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడో భర్త. ఎప్పటిలాగే ఇంటికి తాగొచ్చిన అతను.. ఆమ్లెట్ వేసివ్వాలని భార్యను కోరాడు. గురువారం ఇంట్లో నాన్ వెజ్ కుదరదని ఆమె తెగేసి చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురై దాడికి పాల్పడ్డాడు. ఆపై గొంతు నులిమి హత్య చేశాడు. బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో గురువారం (ఫిబ్రవరి 17) ఈ ఘటన చోటు చేసుకుంది.
నిందితుడిని రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్ రామ్ వినయ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. రామ్ వినయ్ సింగ్ ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై రామ్ వినయ్ సింగ్ మాట్లాడుతూ.. 'నా కొడుకు ఒక తాగుబోతు. ఎప్పటిలాగే గురువారం కూడా ఇంటికి తాగొచ్చాడు. వచ్చేటప్పుడు కోడి గుడ్లు తీసుకొచ్చాడు. ఇంటికొచ్చాక.. ఆమ్లెట్ వేయమని భార్య నీతు సింగ్ (30)ని కోరాడు. అందుకు ఆమె తిరస్కరించింది. గురువారం ఇంట్లో నాన్ వెజ్ కుదరదని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.' అని తెలిపాడు.
'అజిత్ సింగ్ తాగుడుకు అలవాటు పడటంపై అతని భార్య నీతు సింగ్ రోజూ గొడవపడేది. గురువారం కూడా తాగొచ్చినందుకు అతన్ని ప్రశ్నించింది. అలా ఇద్దరి మధ్య గొడవ పెరిగి.. అజిత్ సింగ్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇద్దరు బెడ్ రూమ్‌లో ఉన్నారు. అజిత్ సింగ్ దాడితో అరుపులు, కేకలు పెట్టిన నీతు కొద్దిసేపటికి సైలెంట్ అయింది. దీంతో గొడవ సద్దుమణిగిందేమో అనుకున్నాను. కానీ కాసేపటికి లోపలికి వెళ్లి చూడగా.. ఆమె సీలింగ్‌కి వేలాడుతూ కనిపించింది.' అని వినయ్ సింగ్ చెప్పాడు.
అజిత్ సింగ్ ఆమెను గొంతు నులిమి హత్య చేసి సీలింగ్ వేలాడదీసినట్లు తెలిపాడు. ఘటన తర్వాత అతను ఇంటి నుంచి పారిపోయినట్లు చెప్పాడు. నీతు సింగ్ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Punjab Election 2022: సోనూ సూద్‌ను అడ్డుకున్న ఎన్నికల సంఘం అధికారులు- కారు సీజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook