Indian Railways: వావ్... రైల్వే స్టేషన్లలో కోవిడ్-19 నిఘా కెమెరాల ఏర్పాటు

COVID-19 surveillance cameras: భారతీయ రైల్వే శాఖ కోవిడ్-19 నిఘా కెమెరాల్ని స్టేషన్లలో ఇన్‌స్టాల్ చేయబోతోంది. ఈ నిఘా కెమెరాల ప్రత్యేకతలు వింటే ఆశ్చర్యపోతారు. రద్దీ ప్రదేశాల్లో కూడా ఇకపై కోవిడ్-19 రోగి తప్పించుకోలేడు. నిజమా ? అవును మరి!! అందుకే ఇండియన్ రైల్వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాల్ని ( Artificial Intelligence ) భారీగా కొనుగోలు చేస్తోంది

Last Updated : Jun 27, 2020, 09:47 PM IST
Indian Railways: వావ్... రైల్వే స్టేషన్లలో కోవిడ్-19 నిఘా కెమెరాల ఏర్పాటు

COVID-19 surveillance cameras: భారతీయ రైల్వే శాఖ కోవిడ్-19 నిఘా కెమెరాల్ని స్టేషన్లలో ఇన్‌స్టాల్ చేయబోతోంది. ఈ నిఘా కెమెరాల ప్రత్యేకతలు వింటే ఆశ్చర్యపోతారు. రద్దీ ప్రదేశాల్లో కూడా ఇకపై కోవిడ్-19 రోగి తప్పించుకోలేడు. నిజమా ? అవును మరి!! అందుకే ఇండియన్ రైల్వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాల్ని ( Artificial Intelligence ) భారీగా కొనుగోలు చేస్తోంది. రద్దీ ప్రాంతాల్లో ఓ మనిషి మాస్క్ ధరించాడా లేదా ? బాడీ టెంపరేచర్ ఎలా ఉందనేది తెలుసుకోవడానికి వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన కోవిడ్-19 నిఘా కెమెరాల్ని భారతీయ రైల్వే ఇన్‌స్టాల్ ( Indian railway to install) చేయబోతోంది. భారతీయ రైల్వే శాఖ పరిధిలోని టెలీకామ్ విభాగమైన రైల్‌టెల్ ( Railtel ) దాదాపు 8 వందల కోవిడ్-19 సర్వైలెన్స్ కెమెరాల్ని కొనడానికి టెండర్ దాఖలు చేసింది. వీటిని రైల్వే స్టేషన్లలోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. 

అసలు కోవిడ్-19 సర్వైలెన్స్ కెమెరాల ప్రత్యేకత ఏంటి ?
కృత్రిమ మేధస్సుతో ( Artificial Intelligence ) పనిచేసే కోవిడ్-19 సర్వైలెన్స్ కెమెరాలు ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఇవి రద్దీ ప్రాంతాల్లో కూడా మనిషి బాడీ టెంపరేచర్‌ను రికార్డ్ చేయగలుగుతాయి. మరోవైపు ఎవరైనా మాస్క్ ధరించకపోతే కూడా గుర్తించేస్తాయి. బ్లాక్ బాడీ సెన్సింగ్ సామర్ధ్యం కలిగిన ఈ కెమెరాలు ఒక్కొక్కటీ 4 లక్షల వరకూ ఉంటుందని తెలుస్తోంది. రద్దీ ప్రాంతాల్లో బాడీ టెంపరేచర్‌ను గుర్తించడాన్ని బ్లాక్ బాడీ ( Black body ) అని పిలుస్తారు. 

భారతీయ రైల్వేలో ముంబాయి వంటి కొన్ని జోన్లు ఇప్పటికే వీటిని కొనుగోలు చేశాయి. దేశాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అవలంభించనున్న తదుపరి దశ కంటెయిన్‌మెంట్ వ్యూహంలో భాగంగా వీటిని ఇన్‌స్టాల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

గత నెల రోజులుగా సెంట్రల్ రైల్వేస్, నార్త్ ఫ్రంటియర్ రైల్వే జోన్లు వీటిని ముంబాయి, గౌహతి వంటి పెద్ద రైల్వే స్టేషన్లలో ఇన్‌స్టాల్ చేయడానికి టెండర్లను ఆహ్వానిస్తున్నాయి.

Trending News