ఈ విధానంలో రైల్వే టికెట్ బుకింగ్‌లు రద్దు

భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Last Updated : Mar 12, 2018, 05:32 PM IST
ఈ విధానంలో రైల్వే టికెట్ బుకింగ్‌లు రద్దు

భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐ-టిక్కెట్ల విక్రయాన్ని నిలిపివేయాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఐఆర్‌సీటీసీ ద్వారా నిర్వహించే ఐ-టిక్కెట్‌​ బుకింగ్‌ను మార్చి 1 నుంచి రద్దు చేయాలని ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఆర్‌సీటీసీ) నిర్ణయించిందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఐ-టిక్కెట్ల విక్రయాన్ని ఐఆర్‌సీటీసీ 2002లో ప్రారంభించింది. కౌంటర్ల వద్ద పేపర్ టిక్కెట్ల బుకింగ్ తరహాలో వెబ్ సైట్ నుంచి టిక్కెట్లను పొందేందుకు..  రైల్వే శాఖ ఈ విధానాన్ని అమలు చేసింది.

అయితే ఐ-టిక్కెట్‌ బుకింగ్‌ చేసేటప్పుడు ప్రయాణీకుడు తన అడ్రస్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ, బుకింగ్ సమయంలో పేర్కొన్న ప్రయాణీకుడి చిరునామాకు ఐ-టిక్కెట్‌ను కొరియర్  ద్వారా పంపిణీ చేస్తోంది. ముఖ్యంగా ప్రింట్ అవుట్ తీసుకోలేని ప్రయాణీకులకు ఇది సౌలభ్యంగా ఉండేది. ప్రస్తుతం ఈ-టిక్కెట్ల వాడకం పెరగడంతో ఈ ఐ-టిక్కెట్ల విధానానికి పెద్దగా ఆదరణ ఉండడం లేదు.

ఐ-టిక్కెట్‌ బుకింగ్‌ సమయంలో స్లీపర్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ టిక్కెట్‌కు 80 రూపాయలు, ఏసీ క్లాస్‌ టిక్కెట్‌కు 120 ఛార్జీ విధిస్తారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, మైసూరు, మంగుళూరు, మధురై, కోయంబత్తూర్ వంటి నగరాల్లో రెండు రోజుల ముందే ఐ-టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇతర నగరాల్లో అయితే మూడు రోజుల ముందుగానే వీటిని బుక్ చేసుకోవాలి.

Trending News