Old Parliament: 75 ఏళ్లుగా చారిత్రక ఘటనలు, సంచలన చట్టాలకు వేదికగా నిలిచిన పాత పార్లమెంట్ విశేషాలివే

Old Parliament: దేశంలో 75 ఏళ్లుగా ఎన్నో ఘట్టాలకు, చట్టాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పాత పార్లమెంట్ భవనానికి ఇవాళ చివరి రోజు. రేపట్నించి ఇక్కడ సభ్యుల సందడి ఉండదు. బడ్జెట్‌లు ఉండవు. తీర్మానాలు జరగవు. 75 ఏళ్లుగా పార్లమెంట్‌లో చోటుచేసుకున్న కీలకమైన విశేషాల గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 18, 2023, 06:55 PM IST
Old Parliament: 75 ఏళ్లుగా చారిత్రక ఘటనలు, సంచలన చట్టాలకు వేదికగా నిలిచిన పాత పార్లమెంట్ విశేషాలివే

Old Parliament: నవ భారత నిర్మాణంలో, మహనీయుల ప్రసంగాలకు, స్వాతంత్య్ర భారత ప్రస్థానంలో ప్రతి మలుపుకు సాక్ష్యం ఈ నిలువెత్తు గుండ్రాకారపు రాజసం ఒలికించే పార్లమెంట్ భవనం. ఇవాళ్టితో ఈ భవనం మూగబోనుంది. ఎన్నెన్నో చారిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా నిల్చిన పార్లమెంట్ పాత భవనం విశేషాలు మీ కోసం..

స్వతంత్య్ర భారతావనికి 75 ఏళ్లు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ ఇన్నాళ్లు దేశ సౌర్వభౌమాధికారానికి నిలువెత్తు నిదర్శనంగా ఠీవిగా రాజసం ఒలికిస్తూ నిలబడిన పాత పార్లమెంట్ భవనం రేపట్నించి సందడి కోల్పోనుంది. ఇవాళే చివరి సమావేశాలు జరిగాయి. రేపట్నించి కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పాత పార్లమెంట్ భవనం సాక్ష్యంగా నిలిచిన కొన్ని ఘట్టాలు, కొన్ని వివాదాస్పద చట్టాలను పరిశీలిద్దాం..

పాత పార్లమెంట్ నిర్మాణ నేపధ్యం

1911లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి రాజధానిని తరలించేందుకు నాటి బ్రిటీషు పాలకులు నిర్ణయించాక 1921లో సెక్రటేరియట్ బిల్డింగులో భారీ చాంబర్ నిర్మించారు. అనంతరం ఆర్కిటెక్చర్లు ఎడ్విన్ ల్యూటిన్ రూపొందించిన వృత్తాకార డిజైన్ ఖరారు చేశారు. 1927 జనవరి 19వ తేదీన అప్పటి భారత వైశ్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో 144 పిల్లర్లతో తయారైన ఈ భవనం మధ్యలో సెంట్రల్ హాల్, చుట్టూ మూడు హాఫ్ సర్కిల్ ఛాంబర్లు ఉంటాయి. 

పార్లమెంట్ సాక్షిగా చారిత్రక ఘట్టాలు

1929లో విప్లవకారుడు భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్‌లు ఈ పార్లమెంట్‌పై బాంబు విసిరి అప్పట్లో సంచలనం రేపారు. 1947లో బ్రిటీషు నుంచి అధికార మార్పిడికి ఈ భవనమే సాక్షిగా నిలిచింది. మొదట్లో సుప్రీంకోర్టు కార్యకలాపాలు సైతం ఈ భవనంలోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచే సాగాయి. యూపీఎస్‌సి కార్యాలయం కూడా ఈ భవనంలోనే ఉండేది. 

2001లో పాకిస్తాన్ సహకారంతో లష్కరే తోయిబా తీవ్రవాదులు జరిపిన దాడి పాత పార్లమెంట్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలింది. 

1946 డిసెంబర్ 9వ తేదగీన రాజ్యాంగ సభ తొలి సమావేశం జరగగా, 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఇదే భవనంలో ఆమోదం పొందింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లో వచ్చింది. 

వివాదం-సంచలన చట్టాలు

1956 ది స్టేట్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ . దేశంలో కొంతమంది వ్యతిరేకించినా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన చట్టం. ఈ చట్టం ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 

1992లో వివాదాస్పద మండల్ కమీషన్ సిఫార్సుల్ని ఆమోదించింది పార్లమెంట్. దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రేపిన చట్టమిది.

మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల పునర్విభజన చట్టం 2000. ఈ మూడు చట్టాల ప్రకారం మద్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఘండ్ రాష్టాలు ఏర్పాటయ్యాయి.

ఏపీ పునర్విభజన చట్టం 2014. ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమానికి తలొగ్గి  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ రూపొందిన చట్టం. 

జమ్ము కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2019. జమ్ము కశ్మీర్ సంస్థానం ఇండియాలో విలీనం సందర్భంగా ఆ రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదా ఆర్టికల్ 370 రద్దు చేయడమే కాకుండా జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం.

2019 ది సిటిజన్‌షిప్ ఎమెండ్‌మెంట్ యాక్ట్. దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన చట్టం. ముస్లిమేతర విదేశీయులైన క్రైస్తవ, బౌద్ధ, జైన, పార్శీ, హిందూ సిక్కు మతస్థులకు భారతదేశ పౌరసత్వం కల్పించే చట్టం. మతం ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే వివాదాస్పద చట్టమిదే.

2019 ది ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ యాక్ట్. ముస్లిం వివాహాల్లో ఉండే త్రిపుల్ తలాక్ పద్ధతికి వ్యతిరేకంగా ఆ విదానాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ఇది. త్రిపుల్ తలాక్ చట్టంగా అభివర్ణిస్తారు.

Also read: Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం, ఇకపై లోయర్ బెర్త్‌లు ఆ ప్రయాణీకులకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x