Family forced to get off bus: తమిళనాడులో (Tamilnadu) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నుంచి ఓ కుటుంబాన్ని బలవంతంగా కిందకు దింపేశారు. కండక్టర్ వారిని బయటకు నెట్టి మూటలు రోడ్డుపై విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంధుడైన ఓ వృద్దుడు, అతనితో పాటు ఓ మహిళ, పిల్లవాడిని ఆ వీడియోలో గమనించవచ్చు. బస్సు నుంచి బలవంతంగా కిందకు దింపేయడంతో ఆ చిన్నోడు ఏడుస్తూనే ఉన్నాడు. తమిళనాడులోని కన్యాకుమారి (Kanyakumari) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సంచార జాతికి చెందిన ఆ కుటుంబం (Gypsy Family) గురువారం (డిసెంబర్ 10) నాగర్‌కోయిల్‌లో తిరునల్వేలి వెళ్లే ప్రభుత్వ బస్సులో ఎక్కారు. బస్సు వడసేరి పట్టణానికి చేరుకున్నాక.. డ్రైవర్, కండక్టర్ కలిసి వారిని బలవంతంగా కిందకు దింపారు. బస్సులో ఎక్కాక వాళ్లలో వాళ్లు గొడవపడటం, పోట్లాడుకోవడంతో తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. వారిని దింపేయాలని డ్రైవర్, కండక్టర్లకు చెప్పడంతో బలవంతంగా ఆ కుటుంబాన్ని కిందకు దింపేశారు. ముల్లె, మూటలు రోడ్డుపై విసిరేశారు. దీంతో ఆ మహిళ.. కండక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిందకు దిగగా.. ఏం జరుగుతుందో తెలియక ఆ చిన్నారి ఏడుస్తూనే ఉన్నాడు.
ఈ వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ బస్సు డ్రైవర్, కండక్టర్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సాటి మనుషుల పట్ల ఇలా మానవత్వం మరిచిపోయి వ్యవహరిస్తారా అని చాలామంది నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో స్థానిక టీఎన్‌ఎస్‌టీసీ (TNSTC) మేనేజర్ ఆ డ్రైవర్, కండక్టర్‌లపై చర్యలకు ఆదేశించారు.
ఆ ఘటన మరవకముందే... :
రెండు రోజుల క్రితం ఇదే తమిళనాడులోని (Tamilnadu) కన్యాకుమారి జిల్లాలో ఓ వృద్దురాలిని ఆర్టీసీ బస్సు కండక్టర్ బలవంతంగా కిందకు దింపేశాడు. ఆమె వద్ద చేపల వాసన వస్తుందన్న కారణంతో బలవంతంగా బస్సు నుంచి దింపారు. దీంతో ఆ వృద్దురాలు బస్టాండ్‌లో నిస్సహాయంగా ఏడుస్తూ నిలబడిపోయింది. ఈ ఘటనను తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ (MK Stalin) ఖండించారు. సమాజంలో అందరూ సమానమే అన్న భావనతో ప్రతీ ఒక్కరూ ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Also Read:Hyderabad: వ్యభిచారం చేయాలని 16 ఏళ్ల కూతురిపై తల్లి ఒత్తిడి-కేసు నమోదు చేసిన పోలీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook